Varun Sandesh : తన భార్య నిద్ర మాత్రలు మింగినట్టు చెప్పిన వరుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?
Varun Sandesh : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హిట్టు అందుకొని చాలా కాలమైంది. ఓ మంచి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొన్నాళ్లుగా తనకు అచ్చొచ్చిన లవ్‌స్టోరీస్ కాకుండా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తోన్నాడు వరుణ్ సందేశ్.వరుణ్ సందేశ్ చేసిన తాజా మూవీ నింద. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి రాజేష్ జగన్నాధం వహించాడు. జూన్ 21న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యథార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీ రూపొందుతోంది.
వరుణ్ సందేశ్ గతంలో విలన్‌గా కూడా పని చేశారు. అయితే ఆయన విలన్‌గా చేసిన పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం నింద చిత్రం చేస్తున్న వరుణ్ సందేశ్ తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరుణ్ సందేశ్ హీరోయిన్ వితికా షేర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇప్పటివరకు పిల్లలే కాలేదు. నిత్యం ఈ విషయం పైన ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. అయినప్పటికి ఈ విషయం పైన అదిరిపోయే కౌంటర్లను సైతం ఇస్తూ ఉంటారు ఈ జంట. వరుణ్ తో పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటికి ఈ వార్తలు వైరల్ గా కావడంతో తాజాగా వరుణ్ సందేశ్ ఈ విషయం పైన అసలు విషయాన్ని తెలియజేశారు.
Varun Sandesh : తన భార్య నిద్ర మాత్రలు మింగినట్టు చెప్పిన వరుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?
ముఖ్యంగా తన భార్య వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని దీంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అప్పుడు తనకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు ఇలాంటి మందులు ఇచ్చారని వాటితో పాటు వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిపారు. అయితే వితికా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము. కానీ అందులో నిజం లేదని తెలిపింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని వరుణ్ సందేశ్ తెలిపారు. అయితే వెంటనే ఈ విషయం తెలియగానే బయలుదేరి వచ్చేసానని తెలిపారు. తాను వెబ్ సిరీస్ చేస్తుందని, ఎప్పటికీ తనకి అండగా ఉంటానని వరుణ్ చెప్పుకొచ్చారు.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.