Varun Sandesh Vithika : రొమాన్స్‌తో రచ్చ.. రెచ్చిపోయిన వరుణ్ సందేశ్ వితిక షెరు
Varun Sandesh Vithika : వరుణ్ సందేశ్ వితిక షెరు ఎంత రొమాంటిక్ జంటనే అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఈ జంట చేసిన సందడిని ఎవ్వరూ మరిచిపోరు. నిజమైన అచ్చతెలుగు భార్యభర్తలకు ప్రతీకలుగా నిలిచారు. భార్యగా వితిక షెరు.. భర్తగా వరుణ్ సందేశ్ మంచి మార్కులు సంపాదించారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని బిగ్ బాస్ టీం చూసినా కూడా వారి పాచికలు పారలేదు. మధ్యలో చిన్నగా మాటామాటా పెరిగింది కానీ ఎప్పుడూ కూడా గొడవలు జరగలేదు.
సోషల్ మీడియాలోనూ ఈ ఇద్దరూ బాగానే సందడి చేస్తుంటారు. వరుణ్ సందేశ్ కాస్త మొహమాట పడుతుంటాడు కానీ వితిక షెరు మాత్రం దుమ్ములేపుతుంటుంది. భర్త గురించి, పర్సనల్ విషయాల గురించి వితిక షెరు ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.అలాంటి ఈ ఇద్దరూ తాజాగా సుమ హోస్ట్ చేస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోకి గెస్ట్‌గా వచ్చారు. అక్కడ ఈ ఇద్దరి రొమాన్స్ చూసిన సుమ సెటైర్లు వేసింది.

Varun Sandesh Vithika In Big Celebrity Challenge
Varun Sandesh Vithika : రెచ్చిపోయిన వరుణ్ సందేశ్ వితిక షెరు
షోలోకి ఎంట్రీ ఇస్తూనే రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేస్తూ ఈ లోకాన్ని మైమరిచిపోయినట్టున్నారు. ఇదే విషయాన్ని సుమ చెబుతూ.. మనమంతా ఉన్నామని మరిచిపోయినట్టున్నారు అని కౌంటర్ వేసింది. కొత్త జంట అంటే ఇలానే ఉంటుంది.. మీది ఎప్పుడో పెళ్లి అయింది కదా మీకు తెలియదు అంటూ వెనకలా నుంచి రవి పంచ్ వేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు.
