Varun Tej : వరుణ్ తేజ్‌ను చూసి కుళ్లుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ‘ముకుంద’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. హీరోగా కంటే కూడా యాక్టర్‌గా తనను తాను పదును పెట్టుకున్నాడని సినీ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘గని’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ పైన భారీ ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సంగతులు అలా ఉంచితే…తాజాగా వరుణ్ తేజ్ చేసిన ఓ పనిని చూసి మెగాస్టార్ చిరంజీవి కుళ్లుకున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ చేసిని పనిని నాశనం చేసేశాడట.. ఇంతకీ చిరు ఏం చేశాడంటే..
సినిమా షూటింగ్స్ అయిపోయిన వెంటనే చిరంజీవి.. హ్యాపీగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాడు. అలా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోట చేరారు. ఈ నేపథ్యంలో అందరికీ తానే స్వయంగా ఫుడ్ అందించాలనే ఉద్దేశంలో చిరు దోశలు వేయడం స్టార్ట్ చేశాడు. అలా చాలా దోశలు వేస్తున్న క్రమంలో పెద్దనాన్న చిరుకు సపోర్ట్ ఇచ్చేందుకుగాను వరుణ్ కూడా వెళ్లి దోశలు వేయడం స్టార్ట్ చేశాడు.

varun tej shared funny video of chiranjeevi which got viral in social media
Varun Tej : కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా చిరు ఎంజాయ్ మెంట్..
ఈ క్రమంలోనే చిరు వేసిన దోశలు బాగా రాలేదు. కానీ, వరుణ్ తేజ్ వేసిన దోశలు బాగా రావడంతో
చిరు ఆ దోశను చూసి కుళ్లుకున్నాడు. వెంటనే ఆ దోశను నాశనం చేసేందుకుగాను ప్రయత్నించాడు. ఇదంతా కూడా వీడియో రికార్డు చేశారు. వరుణ్ తేజ్ ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇకపోతే పెదనాన్ని చిరుతో కలిసి వరుణ్ తేజ్ మొత్తం నూటొక్క దోశలు వేశాడు.
View this post on Instagram