Guppedantha Manasu : జగతి చెప్పినట్టుగా వసుధార తన ఊరు వెళ్లిపోతుందా? రిషిని వదిలేస్తుందా? తన పేరెంట్స్ చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu : జగతి చెప్పినట్టుగా వసుధార తన ఊరు వెళ్లిపోతుందా? రిషిని వదిలేస్తుందా? తన పేరెంట్స్ చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందా?

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 12 డిసెంబర్ 2022, ఎపిసోడ్ 630 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను నేను వాళ్ల ఇంటికి వెళ్లమని చెప్పా అని మహీంద్రాతో అంటుంది జగతి. దీంతో ఇప్పుడు వసుధారను ఎందుకు ఇంటికి వెళ్లమంటున్నావు అంటాడు. దీంతో అందరిని నోళ్లు మూయాలంటే ఖచ్చితంగా వాళ్ల ఇద్దరి మధ్య ముడి వేయాలి అని అనుకుంటారు జగతి, […]

 Authored By gatla | The Telugu News | Updated on :11 December 2022,9:00 am

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 12 డిసెంబర్ 2022, ఎపిసోడ్ 630 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను నేను వాళ్ల ఇంటికి వెళ్లమని చెప్పా అని మహీంద్రాతో అంటుంది జగతి. దీంతో ఇప్పుడు వసుధారను ఎందుకు ఇంటికి వెళ్లమంటున్నావు అంటాడు. దీంతో అందరిని నోళ్లు మూయాలంటే ఖచ్చితంగా వాళ్ల ఇద్దరి మధ్య ముడి వేయాలి అని అనుకుంటారు జగతి, మహీంద్రా. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిషి.. కాలేజీలో టీచర్స్ తో మాట్లాడుతాడు.

vasudhara gets angry as lecturers talked ill about jagathi

vasudhara gets angry as lecturers talked ill about jagathi

ఈ మిషన్ ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ అని ఫణీంద్రా కూడా చెబుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ దేశమంతటా విస్తరించడం చూసి మినిస్టర్ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వెంటనే తీసుకురావాలి అంటాడు ఫణీంద్రా. దీంతో జగతి మేడమ్ రాగానే వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అంటాడు రిషి. అందరం చురుకుగా పని చేద్దాం అని చెప్పి రిషి వెళ్లిపోతాడు.

అయితే.. బయటికొచ్చిన ఇద్దరు టీచర్లు.. జగతి మేడమ్ కాలేజీకి ఎందుకు రావడం లేదు అంటూ చర్చించుకుంటారు. ఆవిడ వచ్చినా చేసేది ఏముంది అని అనుకుంటారు. తను చేసే పని లేకున్నా గౌరవం. ఆవిడ స్టయిల్. రెడీ అయ్యే విధానం ఎలా ఉంటుందో చూశారా.. ఎప్పుడూ రెడీ అయినట్టుగా ఉంటుంది అని అనుకుంటారు. ఆవిడ ఇచ్చే ఆ ఐడియాలు మనం ఇవ్వలేమా.. మనం అంత తెలివైన వాళ్లం కాదా అని అనుకుంటారు.

మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని వసుధార అవి విని ఆ టీచర్లకు క్లాస్ పీకుతుంది. జగతి మేడమ్ కు యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు తెలియదా? తను ఇప్పడు రాలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటుంది వసుధార.

జగతి మేడమ్ గురించి మీరు ఆలోచించే విధానం తప్పు అంటుంది వసుధార. నువ్వు మా స్టూడెంట్ లా మాట్లాడటం లేదు. నువ్వు సమ్ థింగ్ స్పెషల్ కదా.. అంటారు. నువ్వు యూత్ ఐకాన్ వి కదా.. ఆమాత్రం ఉంటుందిలే. యూనివర్సిటీ టాపర్ గా నిలిచావని గర్వం ఉండొచ్చు కానీ.. లెక్చరర్స్ దగ్గర ఎందుకు వాటిని చూపించడం అని తనతోనే రివర్స్ లో అంటారు.

Guppedantha Manasu : వసుధార ఎక్కడికెళ్లిందో అని టెన్షన్ పడ్డ రిషి

దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. చూడు వసుధార.. నువ్వు గొప్పదానివి అయితే కావచ్చు కానీ.. లెక్చరర్లకు సలహాలు ఇచ్చేంత గొప్పదానివి అయితే కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ.. రిషి అండ చూసుకొని వసుధార ఇలా రెచ్చిపోతోంది అని అనుకుంటారు వాళ్లు.

మరోవైపు భోజనం చేసే టైమ్ కావడంతో వసుధార ఎక్కడుందో పిలువు అని ఆఫీసు బాయ్ కు చెబుతాడు రిషి. దీంతో తను ఎక్కడా కనిపించడం లేదు అంటాడు ఆఫీసు బాయ్. దీంతో తను ఎక్కడుందో నాకు తెలుసు అనుకుంటాడు రిషి.

తను క్లాస్ రూమ్ లో కూర్చొని ఉండగా తన దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతాడు రిషి. దీంతో ఏం లేదు సార్ అంటుంది వసుధార. నేను ఏమైనా అప్పుడప్పుడు ఎక్కువ చేస్తున్నట్టు, ఎక్కువ మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుందా సార్ అని అడుగుతుంది వసుధార.

దీంతో నా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నానని నాది నాకే అనిపిస్తోంది అంటుంది వసుధార. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు రిషి. దీంతో ఎదుటి వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటుంది వసుధార.

మనం కరెక్ట్ గా ఉంటే చాలు. ఎదుటివాళ్లు.. వాళ్ల సంస్కారాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. ఎదుటి వారి గురించి మన ఆలోచనలను దారి మళ్లించుకోకూడదు. అయినా నేను ఇవన్నీ నీకు చెప్పడం ఏంటి అని అంటాడు రిషి.

సరే.. పదా మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాలి అంటాడు రిషి. ఎందుకు అని అడగకు.. అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది