సినీ ఇండస్ట్రీలో విషాదం.. వేదం నటుడు నాగయ్య మృతి
Vedam nagaiah : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘వేదం’ సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించిన నాగయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. వేదం తర్వాత ఈయనకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా 30కి పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని నర్సరావు పేట దగ్గరలో ఉన్న దేసవరం. అయితే ఇండస్ట్రీలో ఈయనకు ఆలస్యంగా గుర్తింపు వచ్చింది.
Vedam nagaiah : సినీ ఇండస్ట్రీలో విషాదం.. వేదం నటుడు మృతి
వేదం సినిమాతో మొదటి అవకాశం వచ్చింది. మొదటి సినిమాతోనే అద్భుత నటనను కనబర్చడంతో వేదం నాగయ్యగా స్థిరపడ్డారు. లీడర్, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, వంటి పలు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈయన వేదం సినిమలో నటనకు మొదటిసారి రూ. 3 వేలు పారితోషకం అందుకున్నారు.
ఈ మధ్యే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది నాగయ్యకు. దీంతో మా అసోసియేషన్ వాళ్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనకు అండగా నిలిచి ఆదుకున్నారు. భార్య మరణం తట్టుకోలేక మానసికంగా కృంగిపోయిన ఈయన ఈ రోజు తెల్లవారి ఝామున తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.