Veera Simha Reddy – Walther Veeraiah : ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. వాటిలో బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. వీటిలో ఎవరు సంక్రాంతి విన్నర్ అవుతారంటూ తెలుగు మీడియాలను.. సోషల్ మీడియాలోనూ నిత్యం వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. గురువారం బాలయ్య వీర సింహారెడ్డి థియేటర్లలోకి రాగా, నేడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సంక్రాంతి విన్నర్ అవుతారు ? అన్నదానిపై రకరకాల చర్చలు మొదలు అయ్యాయి. రిలీజ్‌కి ముందు వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య..
సినిమాలు ఘన విజయం సాధించాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వచ్చిన బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వచ్చిన చిరంజీవికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని ఆయన మండిపడ్డారు. మనమంతా ఒక్కటే. కులం, మతం, ప్రాంతం ఏవీ మనల్ని విడదీయలేవని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ తో పాటు సెకండాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్ జోడించడంతో ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఎంతగానో అలరించింది.
బాలయ్య అద్భుతమైన నటనతో పాటు పాటలు, నేపథ్య సంగీతం వీర సింహారెడ్డి క్యారెక్టర్, అదిరిపోయే పంచ్ డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులని ఎంతగానో్ అలరించాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కూడా పరమ రొటీన్ స్టోరీ తో తెరకెక్కింది కాని వీర సింహారెడ్డి సినిమాలో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ వాల్తేరు వీరయ్య లో దొరికింది. బాబి ఒక పాత కథకు పాత చింతకాయ పచ్చడి కథనంతో సినిమా తీసినా సినిమాలో చిరంజీవిని బాగా ఉపయోగించుకుని ఎంటర్టైన్మెంట్ సీన్లు రాసుకోవడం.. సెకండ్ హాఫ్ లో మాస్ మహారాజా రవితేజ పాత్ర కథలో కీలకం కావడంతో సినిమా కొంత సేపు ప్రేక్షకులని కూర్చోపెట్టగలిగింది. అయితే ఏ సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుంది అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.