Veera Simha Reddy – Walther Veeraiah : సంక్రాంతికి విడుద‌లైన రెండు పెద్ద సినిమాలు.. ఇద్ద‌రు విన్న‌ర్సే

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2023,7:00 pm

Veera Simha Reddy – Walther Veeraiah : ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. వాటిలో బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. వీటిలో ఎవరు సంక్రాంతి విన్నర్ అవుతారంటూ తెలుగు మీడియాలను.. సోషల్ మీడియాలోనూ నిత్యం వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. గురువారం బాలయ్య వీర సింహారెడ్డి థియేటర్లలోకి రాగా, నేడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సంక్రాంతి విన్నర్ అవుతారు ? అన్నదానిపై రకరకాల చర్చలు మొద‌లు అయ్యాయి. రిలీజ్‌కి ముందు వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య..

సినిమాలు ఘన విజయం సాధించాలి అని ప్ర‌తి ఒక్క‌రు కోరుకున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌చ్చిన‌ బాల మావ‌య్య, వాల్తేరు వీర‌య్యగా వ‌చ్చిన‌ చిరంజీవికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ స‌న్నద్ధమైందని ఆయ‌న‌ మండిపడ్డారు. మ‌న‌మంతా ఒక్కటే. కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవని ట్విటర్ ద్వారా స్ప‌ష్టం చేశారు. వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ తో పాటు సెకండాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్ జోడించడంతో ప్ర‌తి ఒక్క‌రిని ఈ సినిమా ఎంత‌గానో అల‌రించింది.

Veera Simha Reddy – Walther Veeraiah on two heroes are winners

Veera Simha Reddy – Walther Veeraiah on two heroes are winners

Veera Simha Reddy – Walther Veeraiah : ఇద్దరు గెలిచారు..!!

బాలయ్య అద్భుతమైన నటనతో పాటు పాటలు, నేపథ్య సంగీతం వీర సింహారెడ్డి క్యారెక్టర్, అదిరిపోయే పంచ్‌ డైలాగులు అన్నీ కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో్ అల‌రించాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కూడా పరమ రొటీన్ స్టోరీ తో తెరకెక్కింది కాని వీర సింహారెడ్డి సినిమాలో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ వాల్తేరు వీరయ్య లో దొరికింది. బాబి ఒక పాత కథకు పాత చింతకాయ పచ్చడి కథనంతో సినిమా తీసినా సినిమాలో చిరంజీవిని బాగా ఉపయోగించుకుని ఎంటర్టైన్మెంట్ సీన్లు రాసుకోవడం.. సెకండ్ హాఫ్ లో మాస్ మహారాజా రవితేజ పాత్ర కథలో కీలకం కావడంతో సినిమా కొంత సేపు ప్రేక్ష‌కుల‌ని కూర్చోపెట్ట‌గ‌లిగింది. అయితే ఏ సినిమా ఎక్కువ వ‌సూళ్లు రాబ‌డుతుంది అనేది చూడాలి.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి