Lucky Bhaskar Sequel : లక్కీ భాస్కర్ సీక్వెల్ కన్‌ఫాం చేసిన దర్శకుడు.. ఎలా ఉంటుందంటే..!
ప్రధానాంశాలు:
Lucky Bhaskar Sequel : లక్కీ భాస్కర్ సీక్వెల్ కన్‌ఫాం చేసిన దర్శకుడు.. ఎలా ఉంటుందంటే..!
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్ . మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించాడు. అయితే ఈ సినిమా అనంతరం వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు వెంకీ అట్లూరి…

Lucky Bhaskar Sequel : లక్కీ భాస్కర్ సీక్వెల్ కన్‌ఫాం చేసిన దర్శకుడు.. ఎలా ఉంటుందంటే..!
Lucky Bhaskar Sequel : ఈ సినిమా ఎప్పుడు..
గత ఏడాది (2024లో) విడుదలైన ‘లక్కీ భాస్కర్’ అనూహ్య విజయాన్ని సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం అనుకోని మలుపులు తిరిగి, ఆర్థిక అక్రమాల్లో చిక్కుకోవడం అనే కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్‌కు ఆస్కారం కల్పించే విధంగా ముగియడంతో, అప్పటి నుంచే పార్ట్ 2పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో ‘సూర్య 46’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ, ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ (వాథి) సినిమాకు మాత్రం సీక్వెల్ ఉండదని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది, కథాంశం ఎలా ఉంటుంది అనే విషయాలపై మరింత సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.