Sita Ramam Movie Review : సీతారామం మూవీ రివ్యూ & రేటింగ్…!
Sita Ramam Movie Review : మహానటి మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ Dulquer Salmaan . ఆ సినిమా నుండి దుల్కర్ సినిమాలన్నింటికి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా దుల్కర్ సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 5) రిలీజ్ అయింది. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న Rashmika Mandanna , టాలీవుడ్ హీరో సుమంత్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఎలా ఉందనేది చూద్దాం….
Sita Ramam Movie Review : కథ..
లండన్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం తెరకెక్కగా రష్మికకి మేజర్ ఓ బాధ్యతను అప్పజెబుతాడు అతని తాత. మృణాల్ ఎక్కడుందో కనుక్కొని దుల్కర్ సల్మాన్‌కి రాసిన లేఖని అందించాలని చెబుతాడు. మృణాల్ కోసం వెతికే క్రమంలో రష్మిక పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే రష్మిక చివరకు దుల్కర్‌కి లేఖ అందిస్తుందా, ఇంతకు ఆ లేఖలో ఏం రాసాడు, సీక్రెట్ మిషన్‌లో ఉన్న దుల్కర్‌ని పట్టుకోవడానికి ఎవరైనా పాకిస్థాన్ ప్రభుత్వానికి సహాయం చేశారా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సీతారామం సినిమా చూడాల్సిందే…
Sita Ramam Movie Review : పర్‌ఫార్మెన్స్..
క్లాసిక్ రొమాంటిక్ డ్రామాగా సీతా రామం మూవీ ఉండగా, ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ మధ్య కెమెస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంది. రష్మిక మందన్నా క్యారెక్టర్ హైలెట్‌గా ఉంది. ముగ్గురు సినిమాని తమ భుజస్కందాలపై సినిమాని మోశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.. పాటలు ఎప్పటికీ గుర్తిండిపోయాలా ఉన్నాయి. సినిమాటోగ్రాఫీ అద్భుతంగా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు తగ్గిస్తే ఇంకా బాగుండేది. సినిమా కొంత స్లోగా సాగుతుండడం ప్రేక్షకులకి బోర్ తెప్పిస్తుంది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడి చిత్రానికి మంచి ప్లస్ అయింది. ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ కూడా ఉన్నంత వరకు బాగుంది…
ప్లస్ పాయింట్స్ : నటీనటుల పర్‌ఫార్మెన్స్
విజువల్స్
మైనస్ పాయింట్స్ : రిపీటెడ్ సీన్స్ ఫస్టాఫ్ కామెడీ
విశ్లేషణ : సీతారామం మూవీని హను రాఘవపూడి అద్భుతంగా తెరకెక్కించిన కొన్ని తప్పుల వలన సినిమాకి కాస్త నెగెటివిటి వచ్చింది. ఎడిటర్ కొన్ని సన్నివేశాలను తొలగిస్తే బాగుండేది. కళ్లకు కనువిందు చేసేలా ఇందులో విజువల్స్ ఉన్నాయి. అయితే అంచనాలకు మించి సినిమా ఉంది.. ఓ మంచి క్లాసిక్ మూవీగా నిలిచిపోతుంది. ఓవరాల్‌గా సీతా రామం సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో మూవీ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.