Sita Ramam Movie Review : సీతారామం మూవీ ఫస్ట్ రివ్యూ…!

Sita Ramam Movie Review : ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సీతారామం సినిమా. ఈ చిత్రంపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఆగస్టు 3వ తేదీన ప్రభాస్ ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది. టీజర్లు, ట్రైలర్లు, పాటలు సినిమాపై ఫీల్ గుడ్‌ ఒపీనియన్‌ను క్రియేట్ చేయడమే కాకుండా భారీ అంచనాలను పెంచాయి. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన సితా రామం సినిమాకు పాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నాయి.

Advertisement

Sita Ramam Movie Review : స‌మ‌యం వెచ్చించాల్సిన చిత్రం..

తాజాగా ఈ చిత్రంపై ఓ సీనియర్‌ టెక్నీషియన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నపూర్ణలో మెయిన్ అవుట్ హెడ్‌ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న శ్రీ సీవీరావు సోషల్‌ మీడియా వేదికగా ‘సీతారామం’పై ప్రశంసలు కురిపించాడు. ‘ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ‘సీతారామం’ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని, రైటింగ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా బాగుంది. ప్రతీ క్రాఫ్ట్ కు సంబంధించిన టెక్నీషియన్స్ తమ పూర్తి ఎఫర్ట్ తో ఈ మూవీకి వర్క్ చేశారు. మీ విలువైన సమయానికి థియేట్రికల్ అనుభూతిని పొందడానికి సరైన సినిమా ఇది’ అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.ఈ సినిమాలో ప్ర‌తి స‌న్నివేశాన్ని చాలా గ్రాండియ‌ర్‌గా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement
Sita Ramam Movie Review And live Updates
Sita Ramam Movie Review And live Updates

మైనస్ 24 డిగ్రీల వాతావరణంలో కశ్మీర్‌లో షూట్ చేసిన సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు ప్రతీ సన్నివేశం కొత్త అనుభూతికి గురిచేస్తుంది. మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందించడమే కాకుండా ప్రేక్షకుడితోపాటు సినిమా మధురానుభూతులు ఇంటి వరకు వస్తాయి అని చిత్ర యూనిట్‌తోపాటు సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు. మంచి ప్రేమ కథతోపాటు వార్ సీక్వెన్స్ ఆకట్టుకొంటాయి. రష్యా, కశ్మీర్, ఇతర ప్రాంతాల్లో షూట్ చేసిన ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి అనే టాక్ మీడియాలోను, సినీ వర్గాల్లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

అందమైన ప్రేమ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇప్పటికే చాలా లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా సీతారామం అనే మరో ప్రేమ కథ ప్రేక్షకులను అలరించాడనికి రానుంది. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యంలో రష్మిక మందన్న,సుమంత్ , తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

Sita Ramam Movie Review : సీతారామం మూవీ రివ్యూ.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కి మాత్ర‌మే..!

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ న‌టించిన తొలి తెలుగు చిత్రం సీతారం. దర్శకుడు హను రాఘవపూడి పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా సీతారామం తెరకెక్కించారు. రష్మిక మందాన, మృణాళి ఠాగూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో చూద్దాం.

Sita Ramam Movie Review క‌థ‌:

లండన్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం తెర‌కెక్క‌గా ర‌ష్మిక‌కి మేజర్ ఓ బాధ్య‌త‌ను అప్ప‌జెబుతాడు. మృణాల్ ఎక్క‌డుందో క‌నుక్కొని దుల్క‌ర్ స‌ల్మాన్‌కి రాసిన లేఖ‌ని అందించాల‌ని చెబుతాడు. మృణాల్ కోసం వెతికే క్ర‌మంలో ర‌ష్మిక ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ర‌ష్మిక చివ‌ర‌కు దుల్క‌ర్‌కి లేఖ అందిస్తుందా, ఇంత‌కు ఆ లేఖలో ఏం రాసాడు, సీక్రెట్ మిషన్‌లో ఉన్న దుల్క‌ర్‌ని పట్టుకోవడానికి ఎవరైనా పాకిస్థాన్ ప్రభుత్వానికి సహాయం చేశారా? ఇలాంటి విష‌యాలు తెలియాలంటే సీతారామం సినిమా చూడాల్సిందే.

Sita Ramam Movie Review ప‌నితీరు:

చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల ప‌నితీరు అద్భుతం అని చెప్పాలి. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ సినిమా మొత్తాన్ని త‌మ భుజ‌స్కందాల‌పై మోసారు. ర‌ష్మిక కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ప్ర‌కాశ్ రాజ్‌ని అంత‌గా వాడుకోలేద‌ని తెలుస్తుంది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి కాస్త ప్ల‌స్ అయింది. మిగ‌తా ఆర్టిస్ట్‌లు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

నిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. సినిమా కోసం సాంకేతిక విభాగం కూడా ఎంతో కష్టపడినట్టు మనకు కనిపిస్తుంది. హ‌ను రాఘ‌వ‌పూడి స్క్రిప్ట్‌పై బాగానే వ‌ర్క్ చేసిన కూడా కొంత నిడివి త‌గ్గిస్తే బాగుండేది. ఎడిట‌ర్ కొన్ని సీన్స్‌ని క‌ట్ చేయాల్సి ఉంది. సంగీతం బాగుంది.

చివరి మాట: ప్రేమ కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా పండుగ అనే చెప్పాలి. దుల్కర్, మృణాల్ స్వేఛ్చమైన ప్రేమ ప్రతి ప్రేక్షకుడి మనసును తాకుతుంది. ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా సీతారామం.

రేటింగ్‌: 2.25/5

బింబిసార మూవీ ఫుల్‌ రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Advertisement