vennela kishor remuneration :ఒకప్పుడు బ్రహ్మానందం రోజు వారి పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరిగేది. ఆయన పారితోషికం స్టార్ హీరోల రేంజ్ లో ఉండేదంటూ ప్రచారం జరిగేది. ఒక్కరోజు కాల్ షీట్ కి బ్రహ్మానందం లక్ష నుండి రూ. 1,25,000 వరకు వసూలు చేసేవాడట. అప్పట్లో రెమ్యూనరేషన్ చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు అదే స్థాయిలో వెన్నెల కిషోర్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నుండి 6.50 లక్షల రూపాయలను ఒక్కరోజు రెమ్యూనరేషన్ గా వెన్నెల కిషోర్ పొందుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన కేవలం సినిమాల్లో నటించేందుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వాలంటే అదనంగా రోజువారి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనట.
సినిమాల్లో కేటాయించిన డేట్ల అనుసారంగా ఒకటి లేదా రెండు రోజుల ఫ్రీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతాడు, అంతకు మించి ఆయన హాజరు అవ్వాలంటే కచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనట. వెన్నెల కిషోర్ బాగా కమర్షియల్ అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ విషయంలో నిజం ఎంతో కానీ అలాగే ఉండాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడేది కెరియర్ బాగుండాలని, ప్రతి ఒక్కరు సక్సెస్ అనుకుంటారు. కష్టపడుతున్నందుకు ఫలితం కావాలని కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కనుక వెన్నెల కిషోర్ ఒక్కడే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకోరు అనడంలో నిజం లేదు. వెన్నెల కిషోర్ కాస్త కటువుగా రెమ్యూనరేషన్ విషయంలో ఉంటాడేమో కానీ అందరితో సమానంగానే ఆయన వ్యవహరిస్తాడు అనేది కొందరి మాట.
మొత్తానికి నెలలో 20 నుండి 25 రోజుల పాటు షూటింగ్ లేదా ఏదో ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉండే వెన్నెల కిషోర్ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తుంది. అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వెన్నెల కిషోర్ ‘వెన్నెల’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అమెరికా నుండి ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించాలని కొందరు అడిగిన సమయంలో మొదట నిరాకరించాడుట, ఇండియాకు వస్తే మంచి జాబ్ మిస్ అవుతుంది. అక్కడ సినీ కెరియర్ ఎలా ఉంటుందో అనే అనుమానంతో ఇండియాకు వచ్చేందుకు మొదట సంశయించాడట. కానీ వరుసగా వస్తున్న ఆఫర్లతో ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకొని ఇండియా తిరిగి వచ్చి సినిమాలో నటించిన మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం పదుల కోట్లలో ఉంది. ఆస్తులు వందల కోట్లు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదృష్టం అంటే వెన్నెల కిషోర్ దే కదా.. అదృష్టంతో పాటు అతడు చాలా కష్టపడతాడు కనుక ఈ స్థాయిలో ఉన్నాడు అనేది ఆయన సన్నిహితులు మరియు అభిమానుల టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.