vennela kishor remuneration : వెన్నెల కిషోర్‌ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా.. ఆ హీరోలు కూడా దిగదుడుపే

Authored By Tech Desk | The Telugu News | Published on: October 1, 2022, 4:30 pm

vennela kishor remuneration :ఒకప్పుడు బ్రహ్మానందం రోజు వారి పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరిగేది. ఆయన పారితోషికం స్టార్ హీరోల రేంజ్ లో ఉండేదంటూ ప్రచారం జరిగేది. ఒక్కరోజు కాల్ షీట్ కి బ్రహ్మానందం లక్ష నుండి రూ. 1,25,000 వరకు వసూలు చేసేవాడట. అప్పట్లో రెమ్యూనరేషన్ చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు అదే స్థాయిలో వెన్నెల కిషోర్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నుండి 6.50 లక్షల రూపాయలను ఒక్కరోజు రెమ్యూనరేషన్ గా వెన్నెల కిషోర్ పొందుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన కేవలం సినిమాల్లో నటించేందుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వాలంటే అదనంగా రోజువారి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనట.

సినిమాల్లో కేటాయించిన డేట్ల అనుసారంగా ఒకటి లేదా రెండు రోజుల ఫ్రీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతాడు, అంతకు మించి ఆయన హాజరు అవ్వాలంటే కచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనట. వెన్నెల కిషోర్ బాగా కమర్షియల్ అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ విషయంలో నిజం ఎంతో కానీ అలాగే ఉండాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడేది కెరియర్ బాగుండాలని, ప్రతి ఒక్కరు సక్సెస్‌ అనుకుంటారు. కష్టపడుతున్నందుకు ఫలితం కావాలని కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కనుక వెన్నెల కిషోర్ ఒక్కడే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకోరు అనడంలో నిజం లేదు. వెన్నెల కిషోర్ కాస్త కటువుగా రెమ్యూనరేషన్ విషయంలో ఉంటాడేమో కానీ అందరితో సమానంగానే ఆయన వ్యవహరిస్తాడు అనేది కొందరి మాట.

vennela kishor remuneration for day is big shock

vennela kishor remuneration for day is big shock

మొత్తానికి నెలలో 20 నుండి 25 రోజుల పాటు షూటింగ్ లేదా ఏదో ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉండే వెన్నెల కిషోర్ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తుంది. అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వెన్నెల కిషోర్ ‘వెన్నెల’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అమెరికా నుండి ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించాలని కొందరు అడిగిన సమయంలో మొదట నిరాకరించాడుట, ఇండియాకు వస్తే మంచి జాబ్ మిస్ అవుతుంది. అక్కడ సినీ కెరియర్ ఎలా ఉంటుందో అనే అనుమానంతో ఇండియాకు వచ్చేందుకు మొదట సంశయించాడట. కానీ వరుసగా వస్తున్న ఆఫర్లతో ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకొని ఇండియా తిరిగి వచ్చి సినిమాలో నటించిన మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం పదుల కోట్లలో ఉంది. ఆస్తులు వందల కోట్లు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదృష్టం అంటే వెన్నెల కిషోర్ దే కదా.. అదృష్టంతో పాటు అతడు చాలా కష్టపడతాడు కనుక ఈ స్థాయిలో ఉన్నాడు అనేది ఆయన సన్నిహితులు మరియు అభిమానుల టాక్.

Tech Desk

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp