Venu Swamy : ఆ కార‌ణంతోనే నన్ను బూతులు తిడుతున్నారు.. ఎంక్వైరీ చేసుకోండంటున్న వేణుస్వామి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Venu Swamy : ఆ కార‌ణంతోనే నన్ను బూతులు తిడుతున్నారు.. ఎంక్వైరీ చేసుకోండంటున్న వేణుస్వామి

Venu Swamy : సెల‌బ్రిటీ జ్యోతిష్కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు స్వామి. ఆయ‌న సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుబ్ బై చెబుతారని..మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి వార్త‌ల‌లోకి ఎక్కాడు వేణు స్వామి. ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చక చక […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,5:30 pm

Venu Swamy : సెల‌బ్రిటీ జ్యోతిష్కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు స్వామి. ఆయ‌న సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుబ్ బై చెబుతారని..మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి వార్త‌ల‌లోకి ఎక్కాడు వేణు స్వామి. ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయిన ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్ప‌గా, ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ప్ర‌భాస్ న‌టంచిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి….

Venu Swamy నేను దేవుడిని కాదు..

ఇక వేణు స్వామి ద‌గ్గ‌ర చాలా మంది భామ‌లు ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకుంటూ ఉంటారు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకోవ‌డం మ‌నం చూశాం. అయితే కొన్ని సార్లు వేణు స్వామి చెప్పే జాత‌కం రివ‌ర్స్ అవుతుంటుంది. వేణు స్వామి మూడు విషయాల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన గెలుస్తారు అని చెప్పిన తెలంగాణ/ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ ఓటమిపాలయ్యారు. అలాగే హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ టైటిల్ కైవశం చేసుకుంటుందని అన్నాడు. అక్కడ కూడా వ్యతిరేక ఫలితం వచ్చింది. అప్ప‌టి నుండి మ‌నోడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపై రాజకీయాలు, సినిమాలు గురించి జ్యోతిష్యం చెప్పనని అన్నా కూడా ట్రోల్ చేస్తున్నారు. వారికి వేణు స్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

Venu Swamy ఆ కార‌ణంతోనే నన్ను బూతులు తిడుతున్నారు ఎంక్వైరీ చేసుకోండంటున్న వేణుస్వామి

Venu Swamy : ఆ కార‌ణంతోనే నన్ను బూతులు తిడుతున్నారు.. ఎంక్వైరీ చేసుకోండంటున్న వేణుస్వామి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ నాకేమీ కొత్తకాదు. అలాగే నేను దేవుడిని కాదు. నేను చెప్పిన వాటిలో 100 కి 98, 99 శాతం నిజం అయ్యాయి. అది నా సక్సెస్ రేట్. ఎన్నికల ఫలితాల విషయంలో జరగలేదు. అది నేను స్వయంగా ఒప్పుకున్నాను. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, స్వామీజీలు ప్లేటు ఫిరాయించారు. నా ప్రెడిక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిది తప్ప అన్నీ నిజమయ్యాయి. కాబట్టి నేను భయపడే సవాలే లేదు. ట్రోలింగ్ వలన వేణు స్వామి ఎక్కడున్నాడని ఫాలోవర్స్ భయపడుతున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. రిజల్ట్ తర్వాత యధావిధిగా పూజల్లో పాల్గొంటున్నాను. నీ మీద ట్రోల్స్ జరగడం వలన రెగ్యులర్ గా వచ్చే ఎంక్వైరీల కంటే ఇంకో 100 శాతం పెరిగాయి. దాని వలన నేను ఇంకా బిజీ అయ్యాను. మీ ట్రోల్స్ వలన నాకు పని పెరిగింది. ఆ అమ్మవారి దయ నా ట్రోలర్స్ పై, నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా విమర్శించే వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నేను వెయ్యి సుఖాలతో ఇక్కడికి వచ్చిన వాడ్ని కాదు. లక్ష కష్టాలతో ఈ స్థాయిలో ఉన్నాను. ఈ ట్రోల్స్ నేను లెక్క చేయను అని చెప్పుకొచ్చాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది