Venkatesh Wife : వెంకటేష్ భార్య నీరజ ఆస్తులు ఎన్ని కోట్లో చూస్తే నమ్మలేరు …!
Venkatesh Wife : మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న హీరోలలో ఒకరు వెంకటేష్. మరి ముఖ్యంగా ఈయన వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం. ఇండస్ట్రీలో ‘ కలియుగ పాండవులు ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. కానీ ఇప్పటివరకు ఈ హీరో పై ఎలాంటి రూమర్ లేదు. ఒక సందర్భంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోలో తానే స్వయంగా వెంకీని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీలో స్వామి వివేకానంద అని పొగడడంతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
ఇలా మంచికి మారుపేరుగా ఉంటూ చెడు రూమర్స్ ని దగ్గరికి రానివ్వకుండా ఇన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగిన విక్టరీ పెళ్లి చేసుకున్న సతీమణి నీరజ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతటి మహోన్నతమైన క్యారెక్టర్ ఉన్నటువంటి వెంకటేష్ కి ఇప్పటికీ మహిళల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒక వివాహ బంధంలో వారు అద్భుతంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం వారికి వచ్చిన భాగస్వామి. వెంకటేష్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన ఎక్కడా తన భార్య పిల్లల గురించి కానీ కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడరు. నీరజ రెడ్డి గంగవరపు సుబ్బారెడ్డి, ఉషారాణి దంపతులకు జన్మించింది. వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లి.
నీరజ కుటుంబం జమీందారు కుటుంబం . భూమితో పాటు చాలా వ్యాపారాలు ఉన్నాయట. ఆమె తండ్రి మదనపల్లిలో గొప్ప పేరు ఉన్న వ్యక్తి. ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కి పెళ్లి చేయాలని ఎవరైనా అమ్మాయి ఉంటే చూడాలని విజయ్ నాగిరెడ్డికి చెప్పారు. నీరజ అమ్మమ్మ గారు కృష్ణాజిల్లా కైకలురి దగ్గర ఉన్న వరాహపట్నం. వీరిది కూడా సంపన్న కుటుంబమే. ఇక నీరజ మదనపల్లిలో పదవ తరగతి వరకు చదివారు. ఎంబీఏ కూడా చదివారు. అయితే నాగిరెడ్డి వీరి కుటుంబం గురించి చెప్పడంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి నీరజను చూశారు. తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి ఖరారు చేసుకున్నారు. 1989లో నీరజ వెంకటేష్ ల పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటినుంచి ఒక్క రీమార్క్ కూడా లేకుండా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు.