Nayanthara – Vignesh : నడి వీధుల్లో రొమాన్స్.. దుమ్ములేపుతున్న నయన్ విఘ్నేశ్

Authored By aruna | The Telugu News | Published on: August 19, 2022, 6:40 pm

Nayanthara – Vignesh : నయనతార విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం గాల్లో విహరిస్తున్నారు. స్వర్గంలో తేలిపోతోన్నారు. ఇలా ఈ జంట ఎప్పుడూ షికార్లు కొడుతూనే ఉంటుంది. ఒకప్పుడు అయితే రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇలా తిరుగుతుండటంతో అన్ని పాజిటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. చూడముచ్చటైన జంట అని, చక్కని జంట అంటూ ఇలా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక నయన్‌కు ఆ పసుపు తాడు మీదున్న గౌరవం కూడా అందరినీ ఆశ్చర్యపరిచేస్తోంది.

Nayanthara – Vignesh : మన దేశంలో ఉంటేనే హీరోయిన్లు తాళిని, పసుపుతాడును గౌరవించరు. అసలు వారి వాటిని ధరించరు. అలాంటిది నయన్ మాత్రం ఇలా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నా.. ఎటువంటి బట్టలు వేసుకున్నా కూడా నయన్ మాత్రం తన పసుపుతాడుని తీసేయడం లేదు. అదే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక నయన్ ఫోటోలను విఘ్నేశ్ కంటిన్యూగా షేర్ చేస్తూనే ఉన్నాడు. బార్సిలోనా ట్రిప్ మొదలైన క్షణం నుంచి వరుసగా ఫోటోలతో దాడి చేస్తోన్నట్టుగా విఘ్నేశ్ పోస్టుల మీద పోస్టులు పెడుతూనే ఉన్నాడు.

Vignesh Shivan And Nayanthara Cute Pics From Barcelona Vacation

Vignesh Shivan And Nayanthara Cute Pics From Barcelona Vacation

విఘ్నేశ్ నయన్ ప్రస్తుతం బార్సిలోనా వీధుల్లో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే పోజులు ఇస్తున్నారు. వీధుల్లో, సందుల్లో అని తేడా లేకుండా ఫోటోలకు పోజలు ఇస్తున్నారు. తాజాగా నయన్ విఘ్నేశ్ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా అయితే నయన్ ఫోటోలను విఘ్నేశ్ క్లిక్ చేస్తుంటాడు. వికిక్లిక్స్ అంటూ నయన్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. లేదంటే ఎక్కువగా సెల్ఫీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడి ఫేమస్ ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలను షేర్ చేశాడు.ఇందులో నడి వీధుల్లోనే రొమాంటిక్ పోజులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం నయన్ విఘ్నేశ్ ఫోటోలను చూసి జనాలు ఎంజాయ్ పండుగో అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ జంట పెళ్లై రెండు నెలలకు ఇలా మళ్లీ ఒకసారి ఫారిన్ ట్రిప్ వేసేసి ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp