Nayanthara – Vignesh : ఫ్లైట్‌లోనే రొమాన్స్.. విఘ్నేశ్ శివన్ మీద ఎక్కిన నయనతార

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,9:20 pm

Nayanthara – Vignesh : విఘ్నేశ్ శివన్ నయనతార జంట ఎంత చూడముచ్చటగా ఉందో అందరికీ తెలిసిందే. నయనతార తన తాళి బొట్టు ఆ పసుపు తాడును ఎంత గౌరవంగా చూసుకుంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ సింప్లిసిటీనే నయనతార అంటే పడి చచ్చిపోయేలా చేస్తోంది. నయన్ విఘ్నేశ్ పెళ్లి, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, మీడియా చేసిన రాద్దాంతం, తిరుమల వివాదం అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎంతగా రచ్చకు దారి తీశాయో అందరికీ తెలిసిందే.

మామూలుగా అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్లు తాళి బొట్టునే ఉంచుకోరు. ఇక కేవలం పసుపుతాడును ఉంచుకుంటారా? అలా ఎవరైనా ఊహించుకుంటారా? కానీ నయన్ మాత్రం దానికి విలువను గుర్తించి.. మెడలోనే ధరిస్తుంటుంది. ఎక్కడకు వెళ్లినా ఎలాంటి దుస్తులు వేసుకున్నా కూడా తాళి బొట్టును మాత్రం తీయదు. అందుకే నయన్ పట్ల అందరికీ ఇప్పుడు రెట్టింపు గౌరవం ఏర్పడింది. ఈ ఇద్దరూ మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేసిన సమయంలోనూ ఆ పసుపుతాడు కనిపించింది.

Vignesh Shivan Nayanthara Barcelona vacation Trip Pics

Vignesh Shivan Nayanthara Barcelona vacation Trip Pics

Nayanthara – Vignesh : ఫైట్లో నయన్ విఘ్నేశ్ రొమాన్స్..

ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ బార్సిలోనాకు ట్రిప్ వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేశ్ షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తుంటే ఫ్లైట్‌లోనే రొమాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నయన్ చేతిని ముద్దు పెట్టుకున్నాడు విఘ్నేశ్. ఇక విఘ్నేశ్ ఒళ్లో కూర్చుంది నయన్. మొత్తానికి ఈ కపుల్ మాత్రం ఇంకా పెళ్లి నాటి రోజుల్లోనే హాయిగా గడిపేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ జంట మాత్రం ఇప్పుడు క్యాజువల్ ట్రిప్ వేసిందో లేదంటే ఇలా హనీమూన్‌లో భాగంగానే వేశారో తెలియడం లేదు.

నయన్ ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. విఘ్నేశ్ సైతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే కమల్ హాసన్‌కు ఓ స్టోరీ నెరేట్ చేసి ఒప్పించినట్టు తెలుస్తోంది. పెళ్లి తరువాత ఈ ఇద్దరి జీవితం మరింతగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తోంది

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి