Vijay Antony Wife : వాడి వల్లే నా కూతురు సూసైడ్ చేసుకుంది.. విజయ్ ఆంటోనీ భార్య సంచలన వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Antony Wife : వాడి వల్లే నా కూతురు సూసైడ్ చేసుకుంది.. విజయ్ ఆంటోనీ భార్య సంచలన వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :20 September 2023,7:00 pm

Vijay Antony Wife : విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక నటుడిగానే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ గానూ ఆయన సుపరిచితుడు. ఇప్పటికే బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగులోనూ ఆయన హీరోగా ప్రసిద్ధి చెందాడు. ఆయనకు తెలుగులోనూ మార్కెట్ ఉంది. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు.

vijay antony wife emotional words about her daughter meera

#image_title

అయితే.. ఆమె ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందని వార్తలు వస్తున్నాయి. స్కూల్ లో కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని మీరా స్కూల్ యాజమాన్యం చెబుతున్నా మీరా ఆత్మహత్యకు ప్రధాన కారణం మాత్రం డిప్రెషన్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో విజయ్ భార్య ఫాతిమా తన కూతురు గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vijay Antony Wife : తన కూతురును గుర్తుతెచ్చుకొని ఫాతిమా భావోద్వేగం

నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు.. నా ఒత్తిడికి కారణం నీకొంటెతనం సూపర్. నా తంగకట్టి, చెల్లకుట్టి.. మీరా విజయ్ ఆంటోనీ కంగ్రాట్స్ బేబీ అని చెప్పింది. ఆదివారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. నాతో ఉన్న 10 రోజులు కూడా ఇంటి గురించి, పిల్లల గురించి చెప్పేవారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాం. చీకటి అన్నా, ఒంటరిగా ఉండాలన్నా భయపడే మీరా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. మా కుటుంబానికి ఇది నిజంగా కష్టసమయం. దేవుడు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మొన్ననే చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డాడు విజయ్. మీ ఓపిక సహనం ఎంత ఉందో అని దేవుడు పరీక్షిస్తున్నట్టు ఉంది అంటూ ఫాతిమా భావోద్వేగానికి గురయింది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది