Samantha : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్ మొదట్లో మంచి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు హిట్ కోసం తెగ కష్టపడిపోతున్నాడు. చివరిగా నటించిన లైగర్ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గోంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఖుషీ సినిమా హిట్ పక్కా అనే టాక్ నడుస్తుండగా, సమంత వలన ప్రాజెక్ట్ లేట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకి టాలీవుడ్ నుండే కాక బాలీవుడ్ నుండి కూడా వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు వరస ఒప్పేసుకుంటోంది. సమంత కు క్రేజ్ రావటం ప్రస్తుతం ఆమెతో సినిమా చేస్తున్న నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే కానీ…ఆమె వల్ల తమ ప్రాజెక్టు డిలే అవుతోందని గోలెత్తిపోతున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్టోబర్ రెండవ వారం నుంచి ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉమంది. కానీ సమంత డేట్స్ దొరక్క ఆగారని తెలుస్తోంది.
ఆమె కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తో తీయాల్సిన సీన్స్ అవి.నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ నానితో తీసిన టక్ జగదీష్ మాత్రం ఫ్లాపయి షాకిచ్చింది. దాంతో ఇప్పుడు ఖుషి సినిమా మీదే నమ్మకాలన్నీ పెట్టుకున్నాడు. లైగర్ తో విజయ్‌కి కూడా ఫ్లాప్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సమంతకు కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అలాగే, యశోద కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. వాస్తవంగా ఆగస్టు 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.