Liger Movie public talk : పూరి అదొక్కటే మైనస్.. లైగర్ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఇదే..!
Liger Movie public talk : విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు రివ్యూలు మిశ్రమంగా వస్తున్నాయి. ఎక్కువ శాతం రివ్యూవర్స్ సినిమా యావరేజ్ గా ఉందంటూ రేటింగ్ 5 కి రెండు లేదా రెండున్నర ఇచ్చారు. రివ్యూల విషయం పక్కన పెడితే సినిమా కు ఫ్యాన్స్ నుండి మరియు పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేశాం. సినిమాను చూసిన ప్రేక్షకులు చాలా విభిన్నంగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జెన్యూన్ గా సమాధానం చెప్తే కొందరు అభిమానంతో చెబుతున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే లైగర్ సినిమా సాదారణ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. సినిమా నుండి ప్రేక్షకులు ఆశించిన ఎలిమెంట్స్ లేవు అనే టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ ను లైగర్ పాత్రలో ఎలా చూడాలి అనుకున్నామో అలా కనిపించలేదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. నత్తి వాడి పాత్రలో విజయ్ దేవరకొండ మంచి నటన కనబర్చుతాడు అనుకున్నాం. బాక్సర్ గా కూడా విజయ్ దేవరకొండ మెప్పిస్తాడు అనుకున్నాం.. కానీ అలా జరగలేదు అంటూ ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు వస్తూ పెదవి విరుస్తూ అక్కడ నుండి వెళ్తున్నారు.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ పై చాలా నమ్మకం పెట్టుకుని వచ్చిన తమకు నిరాశ తప్పలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. థియేటర్ వద్దకు కేవలం పూరి జగన్నాథ్ కోసం వచ్చిన వారు కూడా ఉన్నారు. ఆయన సినిమా అంటే మ్యాటర్ ఉంటుంది.. కొత్తగా ఉంటుందని వచ్చాం. కానీ ఇది మూస బాక్సింగ్ డ్రామా అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లైగర్ సినిమా పట్ల ఎక్కువ శాతం ప్రేక్షకులు పెదవి విరుస్తూ ఉంటే కొద్ది మంది మాత్రం ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూసినట్లుగా ఉందంటూ పర్వాలేదు అనే రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ రివ్యూ తో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.