Liger Movie : ‘లైగర్‌’ కి తెలుగు కలెక్షన్స్‌ అక్కర్లేదా?

Authored By aruna | The Telugu News | Published on: August 7, 2022, 7:30 am

Liger Movie : టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం ముంబై మరియు చుట్టు పక్కల ఉన్న ఉత్తర భారతంలోనే జరుగుతున్నాయి, కానీ తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర సౌత్‌ రాష్ట్రాల్లో మాత్రం జరగడం లేదు. సినిమా ను సౌత్ లో భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఉత్తర భారతంలో మంచి వసూళ్లు నమోదు అవుతాయి.

గతంలో ఈ విషయం నిర్థారణ అయ్యింది. కానీ లైగర్ సినిమా కు మాత్రం ఇక్కడ ఎక్కువగా ప్రమోషన్ చేయడం లేదు. పూరి జగన్నాథ్ పూర్తి దృష్టి ఉత్తర భారతంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కరణ్‌ జోహార్‌ మరియు పూరి జగన్నాథ్ కలిసి ముంబై లోని పలు ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ అనన్య పాండే తో ప్రమోషన్ కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది. ఉత్తర భారతంలో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో అక్కడ బిజీగా విజయ్ దేవరకొండ ఉన్నాడు. దాంతో తెలుగు అభిమానులు విజయ్ దేవరకొండ పై ఆగ్రహంతో ఉన్నారు.

Vijay Devarakonda and Puri Jagannadh doing Liger Movie promotions in Mumbai only

Vijay Devarakonda and Puri Jagannadh doing Liger Movie promotions in Mumbai only

తెలుగు రాష్ట్రాల వసూళ్లపై విజయ్ దేవరకొండ కు ఆసక్తి లేదా.. సౌతిండియా లో సినిమా కు వసూళ్లు అక్కర్లేదు అన్నట్లుగా కొందరు అసంతృప్తితో ఉన్నారు. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఇంకా కూడా ముంబైలోనే చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ ఇక్కడకి ఎందుకు రావడం లేదంటూ కొందరు ఆరోపిస్తున్నారు. సౌత్లో ప్రమోషన్ చేసినా చేయకున్నా ఒక్కటే అన్నట్లుగా భావిస్తున్నారా.. లేదంటే సౌత్ పై చిన్నచూపు ఏమైనా ఉందా అంటూ విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ ల పై మీడియా వర్గాల్లో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. విడుదలకు వారం ఉండగా హైదరాబాదులో వారు ప్రమోషన్‌ కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp