Liger Movie : లైగ‌ర్ దెబ్బ‌కు పూరీ జ‌గ‌న్నాథ్ ఇల్లు ఖాళీ చేశాడా..!

Authored By Sam C | The Telugu News | Updated on : 8 September 2022, 8:30 pm

Liger Movie : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన లైగ‌ర్ చిత్రం . విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. అయితే విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిశాయి. అయితే డిజాస్టర్ టాక్‌లో కూడా విజయ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లైగర్ చిత్రం తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ అందుకొన్నప్పటికీ.. తొలి వారాంతం నిలకడగా వసూళ్లు సాధించింది. దక్షిణాదిలో భారీ వైఫల్యం చెందినా.. హిందీలో దాదాపు బ్రేక్ ఈవెన్ వద్దకు చేరువైంది.

Liger Movie : లైగ‌ర్ దెబ్బ‌..

ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే.. విజయ్ దేవరకొండ రేంజ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉండేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. పూర ఇమేజ్ కూడా మ‌రింత‌గా పెరిగేది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా పూరీ జ‌గ‌న్నాథ్ గ‌త ఏడాది పూరీ ముంబైకి మ‌కాం మార్చింది. ముంబైలో సీ ఫేసింగ్ 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ని 10 ల‌క్ష‌లకు అద్దెకు తీసుకున్నాడ‌ట‌. మెయింటైన్స్ కోసం మొత్తం రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు అద్దెకు తీసుకున్నార‌ట‌. లైగ‌ర్ ఫ్లాప్ కావ‌డంతో రెంట్ క‌ట్ట‌లేని ప‌రిస్థితుల‌లో ఆ ఫ్లాట్‌ని ఖాళీ చేశాడ‌ట‌. పాపం పూరీ ప‌రిస్థితి దారుణంగా మారింది.

Liger Movie effects to the puri jagannath

Liger Movie effects to the puri jagannath

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. ప్రతికూల ఫలితంలోనూ ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకోవడం అది విజయ్ క్రేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైంది. ఈ నెంబర్స్ చూస్తుంటే ..ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి