Charmy Kaur : ఛార్మిని మెగా ఫ్యాన్స్‌ ఏకి పడేస్తున్నారు.. పాపం అమ్మడికి దెబ్బ మీద దెబ్బ

Authored By aruna | The Telugu News | Published on: August 30, 2022, 12:20 pm

Charmy Kaur : హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం పూరితో కలిసి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఛార్మి కౌర్‌ ను ఉన్నట్లుండి మెగా ఫ్యాన్స్‌ కౌంటర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లైగర్‌ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్న ఆమె కు తీవ్ర నిరాశ తప్పలేదు. లైగర్ సినిమా కోసం చాలా కష్టపడ్డాం అంటూ సినిమా ప్రమోషన్ సమయంలో ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న ఛార్మి తాజాగా సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆమెను మెగా ఫ్యాన్స్ టార్గెట్‌ చేసి సినిమా ఫ్లాప్‌ నేపథ్యంలో కౌంటర్‌ ఇవ్వడం తో ఆమె మరింతగా చిరాకు పడుతూ ఉంటారు.

అసలు విషయం ఏంటీ అంటే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా పూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందేందుకు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే చిరంజీవి సమాచారం కూడా ఇవ్వకుండా పూరి సినిమా ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. పూరి సినిమాను చిరంజీవి క్యాన్సల్‌ చేసుకోవడంతో ఛార్మికి మెగా కాంపౌండ్ మీద కోపం వచ్చింది. అప్పుడే విడుదల అయిన బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేస్తూ క్లాప్స్ కొట్టింది. ఆ సమయంలో చాలా మంది బ్రూస్ లీ సినిమా ఫ్లాప్‌ అయినందుకే ఛార్మి ఆ ట్వీట్‌ చేసిందని అన్నారు. అందుకు ఆమె రెస్పాన్స్ లేదు.

mega fans social media trolls on liger movie producer Charmy Kaur

mega fans social media trolls on liger movie producer Charmy Kaur

ఆ ట్వీట్ ను ఇంకా ఛార్మి అలాగే ఉంచింది. ఇప్పడు లైగర్‌ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ ట్వీట్ ను రీ ట్వీట్‌ చేస్తూ ఛార్మిని తీవ్రంగా అవమానిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె ఆ సమయంలో చేసిన పనికి ఇప్పుడు సరైన ఫలితం ను దక్కించుకుందని.. ఒక సినిమా గురించి లేదా ఒక వ్యక్తి గురించి హేళనగా మాట్లాడే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లైగర్ సినిమా ఫ్లాప్ అయిన దెబ్బ తో ఉంటే మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ తో ఛార్మికి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉందట.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp