Anasuya : అనసూయ మీద రెచ్చిపోతోన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ .. ఆంటీ అన్న మాటలు మీరే చూడండి , మీకైనా కోపం వస్తుంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 May 2023,1:00 pm

Anasuya : జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ప్రస్తుతం సినిమాలలో బిజీగా గడుపుతుంది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే నెటిజన్స్ నుంచి ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అనసూయ పరోక్షంగా పెట్టే పోస్టులు అభిమానులకి కోపం తెప్పిస్తున్నాయి. మరి ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తూ రీసెంట్గా పోస్ట్ పెట్టింది. దీంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ అనసూయ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

Vijay Devarakonda fans are angry about Anasuya

Vijay Devarakonda fans are angry about Anasuya

ఇదివరకే విజయ్ దేవరకొండ అనసూయ మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. లైగర్ సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు అనసూయ పరోక్షంగా సెలబ్రేట్ చేసుకుంది. కర్మ బూమరాంగ్ అవుతుంది అని పాపం అనుభవించాల్సిందే అన్న కోణంగా అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ విజయ్ దేవరకొండ కోసమే చేసింది అంటూ అప్పట్లో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఈ క్రమంలోనే ఈసారి కూడా విజయ్ దేవరకొండపై పరోక్షంగా ట్వీట్ చేసింది అనసూయ. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.

Anasuya Bharadwaj stands against age shaming after Vijay Deverakonda's  rowdy fans attack her online: 'This is my final warning' | Entertainment  News,The Indian Express

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పేరు ‘ దీ విజయ్ దేవరకొండ అంటూ మెన్షన్ చేశారు. అయితే అనసూయ ట్విట్టర్ ఖాతాలో అమ్మ బాబోయ్ దీ నా .. ఏం పైత్యం రా బాబు అంటూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండను డి గ్రేడ్ చేస్తూ చేసింది అంటూ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. మీకు అవసరం లేని విషయంలో తలదూర్చడం ఎందుకు అనసూయ అంటూ తిడుతున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు మరోసారి అనసూయ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ విజయ్ దేవరకొండ మధ్య ఉన్న వార్ బాగా ట్రెండ్ అవుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి