Vijay Devarakonda : త్వరలోనే నా పెళ్లి .. ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vijay Devarakonda : త్వరలోనే నా పెళ్లి .. ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..?

Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ మూవీ ‘ ఖుషి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ డైరెక్టర్ ఖుషి సినిమాతో మరో హిట్ ను అందుకోవాలని రెడీగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2023,4:00 pm

Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ మూవీ ‘ ఖుషి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ డైరెక్టర్ ఖుషి సినిమాతో మరో హిట్ ను అందుకోవాలని రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, పాటలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగేలా సినిమా యూనిట్ చూస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లుక్ ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కాశ్మీరులో తనకు పరిచయం అయిన ఆరాధ్య అనే సమంతతో తొలి పరిచయంతోనే ప్రేమలో పడతాడు విజయ్ దేవరకొండ. ఆమె ముస్లిం అనుకోని ప్రేమలో మునిగిపోతాడు. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలుస్తుంది. అసలు ఆమె బేగం కాదని బ్రాహ్మిణ్ అని తెలుసుకుంటాడు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆరాధ్య వేరే కుటుంబానికి చెందిన విప్లవ్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

Vijay devarakonda Khushi cinema trailer launch

Vijay devarakonda Khushi cinema trailer launch

దీంతో అసలు సమస్య తలెత్తుంది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. దీంతో ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇద్దరు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే అనూహ్యంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏమైందో, వీళ్లిద్దరు ఎలా కలిశారో, అసలు బేగం గా ఆరాధ్య ఎందుకు మారింది అనే విషయాలు సిల్వర్ స్క్రీన్ పై చూడాలి. అయితే ఆ మధ్య విజయ్ దేవరకొండ పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన ఫ్యామిలీ ఇష్ట ప్రకారమే తాను పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. దీంతో ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది