Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ ఖుషి ‘ సినిమా ఈనెల 1వ తారీఖున గ్రాండ్గా విడుదలైంది. తొలి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. రెండు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుంటే మరోవైపు నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ అవుతుంది. విజయ్ దేవరకొండ కెరియర్ను దెబ్బతీయాలని ఖుషి సినిమా కు వ్యతిరేకంగా పనిచేయడానికి కొంతమంది పనిచేస్తున్నారనే వాదనను విజయ అభిమానులు తెరపైకి తెచ్చారు.
ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో విజయ్ నటించిన ఖుషి సినిమా బాగోలేదని చెబుతూ వన్ బై టెన్ రేటింగ్స్ పదివేల వరకు నమోదయ్యాయి. అయితే అవి నిజంగా వచ్చినవి కాదని, బాట్స్ అని ఆటోమేటిక్ గా సిస్టంద్వారా మ్యానిప్యులేట్ చేసి తక్కువ రేటింగ్స్ ఇచ్చి సినిమా రేటింగ్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని రౌడీహీరో అభిమానులు ఆరోపిస్తున్నారు. సినిమా చూసి రేటింగ్ ఇస్తే పర్వాలేదు కానీ, సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారు అని, వారిని ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నారు.అయితే దీని వెనక ఒక ప్రముఖ హీరో టీమ్ ఉందని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని ఎవరు చెప్పడం లేదు. నిజంగానే బుక్ మై షో కి ఇలాంటి తప్పుడు రేటింగ్ ఇచ్చారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

పదివేల ఫేక్ రేటింగ్స్ వస్తే దీని వెనక ఎవరో కావాలని కుట్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఖుషి సినిమా ను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ సినిమాతో విజయ్ సామ్ లకు మంచి గుర్తింపు వచ్చింది.