Liger Movie : పాన్ ఇండియా స్థాయిలో ‘లైగర్’ సత్తా ఎంత?

Authored By aruna | The Telugu News | Published on: August 24, 2022, 1:20 pm

Liger Movie : విజయ్ దేవరకొండ గత చిత్రాలు వరల్డ్‌ ఫేమస్ లవర్‌ మరియు అంతకు ముందు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ సినిమా అనగానే చాలా మంది పాజిటివ్ వైబ్స్ తో మాట్లాడుతున్నారు. పైగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సినిమా అయినా కూడా లైగర్‌ గురించి చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు. పూరి సూపర్‌ హిట్ చిత్రాల దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పూరి చాలా అట్టర్ ప్లాప్ సినిమాలను చేశాడు. అయినా కూడా ఆయన సినిమా అంటే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

లైగర్‌ సినిమా ను మొదటి నుండి కూడా ఒక భారీ పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా ప్రచారం చేస్తూ వచ్చారు. సినిమా విడుదల సమయం లో విజయ్ దేవరకొండ వ్యూహాత్మకంగా నెల రోజుల నుండే ముంబయి తో పాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనన్య పాండేతో కలిసి ఉత్తర భారతంలో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ ఆధరణ అక్కడ లభిస్తుంది. కనుక ఈ సినిమా కూడా అక్కడ మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంతా నమ్మకంతో ఉన్నారు.

vijay devarakonda Liger movie pan india range craze

vijay devarakonda Liger movie pan india range craze

పాన్ ఇండియా స్థాయిలో లైగర్‌ సినిమా కచ్చితంగా స్ట్రాంగ్ ప్రభావం చూపిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఉత్తర భారతంలో లైగర్‌ సినిమా కనీసం పాతిక కోట్ల వరకు వసూళ్లు సాధించినా కూడా గొప్ప విషయమే. సినిమాకు వచ్చిన పాజిటివ్‌ బజ్ నేపథ్యం లో భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్‌ జరుగుతున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన లైగర్‌ సినిమా ఉత్తర భారతంతో పాటు తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న లైగర్‌ సినిమా దేశ వ్యాప్తంగా దుమ్ము రేపుతుందనే నమ్ముదాం.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp