Vijay devarakonda : విజయ్ దేవరకొండ ‘లైగర్’ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అన్న వెరైటీ ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి నిర్మిస్తుండగా కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం టాకీ పార్ట్ ముంబై లోని ధారావి లో కంప్లీట్ చేశాడు పూరి. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.
అయితే లాక్ డౌన్ తర్వాత అన్నీ సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయీ… రిలీజ్ డేట్స్ అనౌన్స్ అవుతున్నాయి.. అలాగే రిలీజ్ కూడా అయిపోయాయి. కాని జెట్ స్పీడ్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పూరి జగన్నాధ్ మాత్రం లైగర్ సినిమా విషయం లో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. గత కొన్ని రోజులుగా ముంబై లో ఉన్నప్పటికి షూటింగ్ మొదలు పెట్టినట్టు ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. ఈ మధ్య టాలీవుడ్ సినిమాలన్ని రిలీజ్ డేట్ లాక్ చేసుకొని అధికారకంగానూ ప్రకటించారు. కాని పూరి – విజయ్ ల కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ సినిమా రిలీజ్ డేట్ మాత్రం రాలేదు.
దాంతో పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ లైగర్ సినిమాకి సంబంధించి వస్తున్నాయి. దాంతో పూరి టీం లైగర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అన్నిటికి చెక్ పెట్టారు. లైగర్ సినిమాని సెప్టెంబర్ 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అని చిత్ర బృందం ప్రకటించారు. దాంతో ఇన్నాళ్ళు లైగర్ సినిమా విషయంలో ఉన్న అనుమాలకి క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు లైగర్ సినిమా బడ్జెట్ 120 కోట్లని సమాచారం. కాగా ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.