Chiranjeevi : చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకాభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచే పది మంది వరకు హీరోలున్నారంటే వీరందరి సినిమాలు ఒకే ఏడాదిలో వస్తే బాక్సాఫిస్ వద్ద సునామీ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మెగాస్టార్ చిరంజీవి .. పవన్ కళ్యాణ్ సహా దాదాపు అందరు మెగా హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో ..నిర్మిస్తున్నవే. ఇక మెగాస్టార్ .. పవర్ స్టార్ .. మెగా పవర్ స్టార్ ల సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలుగా రూపొందుతుండటం విశేషం.
chiranjeevi-kalyan-devs-theme-of-kinnerasani-released
తాజాగా మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇండస్ట్రీ తో పాటు ప్రతీ ఒక్కరి చూపు ఈ సినిమా మీదే ఉంది. కాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కిన్నెరసాని’. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ మెగా అభిమానులనే కాదు .. ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా కిన్నెరసాని సినిమా నుంచి ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమా కి ‘అశ్వథ్థామ’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్న రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివరిలో కళ్యాణ్ దేవ్ ని రివీల్ చేశారు. లుక్ పరంగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా తో పాటు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అన్న సినిమాని చేస్తున్నాడు.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.