Vijay Deverakonda : విజ‌య్ రూటే స‌ప‌రేటు… ఈవెంట్‌లోకి డైరెక్ట్‌గా బైక్‌పై వ‌చ్చేసిన రౌడీ బాయ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vijay Deverakonda : విజ‌య్ రూటే స‌ప‌రేటు… ఈవెంట్‌లోకి డైరెక్ట్‌గా బైక్‌పై వ‌చ్చేసిన రౌడీ బాయ్

Vijay Deverakonda : రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయ‌న సినిమాలు వ‌రుస ఫ్లాపులు అవుతున్నా కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుండ‌గా, మూవీకి సంబంధించి […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,1:10 pm

ప్రధానాంశాలు:

  •  Vijay Deverakonda : విజ‌య్ రూటే స‌ప‌రేటు... ఈవెంట్‌లోకి డైరెక్ట్‌గా బైక్‌పై వ‌చ్చేసిన రౌడీ బాయ్

Vijay Deverakonda : రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయ‌న సినిమాలు వ‌రుస ఫ్లాపులు అవుతున్నా కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుండ‌గా, మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ప‌ర‌శురామ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ ప‌లు ప్రాంతాల‌లో తిరుగుతూ మూవీపై అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Vijay Deverakonda నీ రూటే స‌ప‌రేటుగా…

అయితే నిన్న రాత్రి ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మొత్తం సంద‌డి చేశారు. అయితే సాధార‌ణ హీరోల‌కి డిఫ‌రెంట్‌గా ప్ర‌య‌త్నిస్తుంటాడ‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. స్పీచ్ లు, అతని సినిమాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాబ‌ట్టే అత‌నికి త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ క్రేజ్ ద‌క్కింది. అయితే ఫ్యామిలీ స్టార్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ బైక్ పై మృణాల్ ఠాకూర్ ని ఎక్కించుకొని స్టేజి వరకు తీసుకొచ్చాడు. చుట్టూ కెమెరాలు, బౌన్సర్లు మధ్య విజయ్ మృణాల్ ని బైక్ పై తీసుకొస్తుండ‌గా, అది చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు ఆయ‌న వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, అది చూసిన వారంద‌రు కూడా అన్నా నీ రూటు స‌ప‌రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ఆయ‌న‌పై చాలా మంది ట్రోలింగ్ చేశారు. కాని వాట‌న్నింటిని ఓపిక‌గా భ‌రించిన విజ‌య్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చిత్రంతో మంచి హిట్ కొట్టబోతున్న‌ట్టుగా తెలుస్తుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు మంచి సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పటికి గీత గోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయాను. ఆ సినిమాకి 100 కోట్లు కొట్టాను. ఆ తర్వాత ఓ సినిమాకి 200 కోట్లు కొడతానని చెప్పను. కానీ కొట్టలేకపోయాను. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా 200 కోట్లు కొడతా అని చెప్పడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడం తప్పు. దాని వాళ్ళ నేను ఎన్నో తిట్లు తిన్న, అవమానాలు చూసాను. కానీ నేను ఏదో ఒక రోజు నేను 200 కోట్లు కొడతా. అప్పటివరకు తిడుతూనే ఉండండి. దీనిని మీరు ఏమైన అనుకోండ‌ని విజయ్ దేవ‌ర‌కొండ అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది