Superstar Krishna last rites tomorrow
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఇండస్ట్రీతోపాటు కుటుంబం ఎంతో వేదన చెందుతుంది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మరణించడం జరిగింది. దీంతో కృష్ణ పార్థివ దేహాన్ని కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఆయన సొంత నివాసం నానక్ రామ్ గుడాకి తరలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:00 నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనర్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియోకి అనంతరం కృష్ణ భౌతికకాయాన్నికి
మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 79 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న కార్డియాక్ అరెస్ట్ కావటంతో హాస్పిటల్ లో జాయిన్ కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవటంతో కృష్ణ ఆరోగ్యం విషమించి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూనే ఈరోజు ఉదయం తెల్లవారుజామున మరణించడం జరిగింది. వైద్యులు ఆయనను కాపాడటానికి ఎంతో శ్రమించారు. కానీ పరిస్థితి నిన్న సాయంత్రానికే చేయి దాటి పోవడం జరిగింది అంట.
Superstar Krishna last rites tomorrow
ఈ క్రమంలో ఈరోజు ఉదయం కృష్ణ తుదిశ్వాస విడిచారు. దాదాపు 350కి పైగా సినిమాలు చేసిన కృష్ణ తెలుగు సినిమా రంగం అభివృద్ధి చెందటంలో కీలక పాత్ర పోషించారు. ఇండస్ట్రీని సాంకేతిక పరంగా పైకి తీసుకురావడంలో ఎన్నో సాహసాలు చేశారు. జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి సినిమాలు చేసి…తెలుగు సినిమా రంగంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో కృష్ణ మరణంతో రేపు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో షూటింగ్స్ మొత్తం బంద్ అయిపోయాయి.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.