Vijayashanthi : మా ఎన్నికలపై విజయశాంతి ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్
Vijayashanthi : గత వారం పదిరోజులుగా మా కుర్చీకోసం ఆర్భాటం మొదలైన సంగతి తెలిసిందే. ప్రతీ రెండేళ్ళకి ఓ సారి జరిగే మా ఎలక్షన్స్ కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా పోటీ వాతావరణం నెలకొంది. ఈ పదవికి పోటీ చేస్తున్న వారు ఎవరికి వారే మా లో ఇన్నాళ్ళు జరిగినవన్నీ మాకే తెలుసునని ఇకపై మా ఎలా ఉండాలో అలా నడపడానికి మా వద్ద కొత్త ప్రణాళికలు, వ్యూహాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్‌లో జరగబోయో మా ఎలక్షన్స్‌కి ఇప్పుడే వేడి మొదలైంది. ముందు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ – మంచి విష్ణు బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.
ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానల్ ను ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించాడు. ఆ తర్వాత సీనియర్ నరేష్ సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి జీవిత రాజశేఖర్ హాజరవ్వాలింది. ఎందుకు హాజరవ్వలేకపోయిందో తర్వాత వివరణ ఇచ్చింది. ఆ తర్వాత మంచు వారబ్బాయి మంచు విష్ణు ..చిత్ర పరిశ్రమని నమ్ముకున్న కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని..చిన్నప్పటి నుంచి ఇక్కడ కష్ట నష్టాలు చూస్తున్న వాడిని..మీ అందరి సహాయ సహకారాలందిస్తే మా ని నడిపించడానికి ఇక్కడ సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేసి తెలిపాడు.
Vijayashanthi : సివిఎల్ నరసింహారావుకి విజయశాంతి సపోర్ట్
ఇక బరిలో సీనియర్ నటి హేమ కూడా నిలిచారు. ఆమె ఇప్పటికే మా లో పలు కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి నాకు ఇక్కడ సమస్యలు క్షుణంగా తెలుసునని అవన్నీ తీర్చడానికి నాకంటూ ఒక ప్లానింగ్ ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ బరిలో సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇంతమంది పోటీ పడటం అనేది ఈసారి చాలా ఆసక్తిగా మారింది. అయితే ఈయనకి సీనియర్ స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు విజయశాంతి …సివిఎల్ నరసింహారావు ఈ పదవికి అన్ని విధాల అర్హుడని సపోర్ట్ చేస్తూ షాకిచ్చారు.
Vijayashanthi : సివిఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైనది.
ఎన్నికలపై ఆయన పడుతున్న ఆవేదన న్యాయమైనదని మాట్లాడారు. అంతేకాదు సీవీఎల్ నరసింహారావు ప్యానెల్ తెలంగాణ వాదమని..తెలంగాణ కళాకారులు, వాళ్ల ఇబ్బందులే తన ఎజెండా అని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చిన్న, పెద్ద, మధ్య తరగతి కళాకారులు ఉన్నారని..వాళ్లకు జరుగుతున్న అన్యాయం కూడా.. మ్యానిఫెస్టోలో ముఖ్య అంశమని తెలిపిన విజయశాంతి. ‘మా’కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి.. రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి రానున్న రోజుల్లో మా పదవికి ఇంకా ఎవరెవరు వచ్చి పోటీ చేస్తారో వేచి చూడాలి.