Vijaydevarakonda Rashmika Mandanna : అడ్డంగా దొరికిన విజయ్-రష్మిక.. ఒకే కారులో పక్కపక్కనే.. వీడియో.!
ప్రధానాంశాలు:
Vijaydevarakonda Rashmika Mandanna : అడ్డంగా దొరికిన విజయ్-రష్మిక.. ఒకే కారులో పక్కపక్కనే.. వీడియో.!
Vijaydevarakonda Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ కూర్చుని కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Vijaydevarakonda Rashmika Mandanna : అడ్డంగా దొరికిన విజయ్-రష్మిక.. ఒకే కారులో పక్కపక్కనే.. వీడియో.!
Vijaydevarakonda Rashmika Mandanna : దొరికారు..
దీంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ కలిసే ఉంటున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి.
ఇదిలాఉంటే.. రష్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ. రష్మిక నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. చూస్తుంటే త్వరలోనే వారిద్దరు వారి బంధం గురించి అఫీషియల్ ప్రకటన చేస్తారేమో.
#RashmikaMandanna and #VijayDeverakonda are spotted together at Mumbai airport pic.twitter.com/r5IN3ANmPT
— Filmy Focus (@FilmyFocus) June 18, 2025