Brahmamudi Today 19 Feb 2026 Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 19 ఎపిసోడ్: అప్పూకి ఆడబిడ్డ.. రాజ్, కావ్యలకు మంత్రి ఆహ్వానం..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 February 2026,9:05 am

Brahmamudi Today 19 Feb 2026 Episode : స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘బ్రహ్మముడి’ Brahmamudi రోజుకో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కుటుంబ బంధాలు, ఎమోషన్స్, కుట్రల నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ లో తాజా ఎపిసోడ్ ఎన్నో కీలక మలుపులకు వేదికైంది. ఫిబ్రవరి 19న ప్రసారమైన 960వ ఎపిసోడ్ Episode 960లో ఆద్యంతం ఉత్కంఠభరిత, భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. రాజ్, కావ్యలు ప్రాణాలకు తెగించి అప్పూ, కల్యాణ్‌లను రక్షించడం.. దుగ్గిరాల ఇంట పండగ వాతావరణం నెలకొనడం ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. అసలు ఈరోజు ఏం జరిగిందో ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం.

Brahmamudi Today 19 Feb 2026 Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 19 ఎపిసోడ్: అప్పూకి ఆడబిడ్డ.. రాజ్, కావ్యలకు మంత్రి ఆహ్వానం..!

Brahmamudi Today 19 Feb 2026 Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 19 ఎపిసోడ్: అప్పూకి ఆడబిడ్డ.. రాజ్, కావ్యలకు మంత్రి ఆహ్వానం..!

Brahmamudi Today 19 Feb 2026 Episode : అప్పూ, కల్యాణ్‌ల కిడ్నాప్ – కాపాడిన రాజ్, కావ్య

గత ఎపిసోడ్స్‌లో అప్పూ, కల్యాణ్‌లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజ్ మరియు కావ్య ఓ ఇంట్లో వచ్చిన వీడియోలోని క్లూస్ ఆధారంగా.. ముఖ్యంగా ఆ వీడియోలో కనిపించిన ఫోన్ నెంబర్ సాయంతో అప్పూ, కల్యాణ్ ఉన్న అడ్రస్‌ను పసిగడతారు. వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి అప్పూకి నెలలు నిండటంతో నొప్పులు మొదలవుతాయి. భార్య బాధ పడటం చూసిన కల్యాణ్.. దయచేసి తమను వదిలేయాల్సిందిగా రౌడీలను వేడుకుంటాడు, బతిమాలుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న రాజ్, కావ్యలు రౌడీల కన్నుగప్పి వారిని విడిపించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో రౌడీలు రాజ్ పై దాడి చేయడంతో అతను స్పృహతప్పి పడిపోతాడు. అయినా సరే తిరిగి తేరుకుని, తన తమ్ముడు, అప్పూల కోసం రౌడీలను చితకబాదుతాడు.

Brahmamudi Today 19 Feb 2026 Episode : రుద్రాణి కుట్రలు – అప్పూకి పండంటి ఆడబిడ్డ

ఇదిలా ఉంటే, అప్పూ, కల్యాణ్ తప్పించుకున్నారని రుద్రాణికి రౌడీల నుంచి ఫోన్ వస్తుంది. ఇది విన్న రుద్రాణి షాక్ అవ్వడమే కాకుండా.. వాళ్లు దొరికితే తన బండారం బయటపడుతుందని, ఎలాగైనా వాళ్లను చంపేయమని ఆర్డర్ వేస్తుంది. అప్పూని చంపబోతున్న రౌడీలను రాజ్ అడ్డుకుని అందరినీ మట్టికరిపిస్తాడు. వెంటనే అప్పూని ఆసుపత్రికి తరలిస్తారు. ఆసుపత్రిలో అప్పూని చూసిన ధాన్యం.. “మీరే కిడ్నాప్ చేయించి మీరే కాపాడుతున్నారా?” అని రాజ్, కావ్యలను నిందించగా కల్యాణ్ గట్టిగా బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత డాక్టర్ అనురాధ వచ్చి అప్పూకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని శుభవార్త చెబుతుంది. దీంతో దుగ్గిరాల కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

తన తప్పు తెలుసుకున్న ధాన్యలక్ష్మీ – ట్రస్ట్ కు గ్రీన్ సిగ్నల్

కల్యాణ్ జరిగిన వాస్తవాలు, రుద్రాణి లేదా ఇతర శత్రువుల కుట్రలను వివరించడంతో ధాన్యలక్ష్మీ తన తప్పును తెలుసుకుంటుంది. అనవసరంగా రాజ్, కావ్యలను అపార్థం చేసుకున్నానని పశ్చాత్తాపపడుతుంది. అందరి ముందు, ముఖ్యంగా రాజ్, కావ్యల ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు చెబుతుంది. ఇంతకాలం తాను వ్యతిరేకించిన ‘ట్రస్ట్’ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ధాన్యలక్ష్మీ మనసు మారడంతో ఇందిరాదేవి, అపర్ణ తదితరులు ఎంతో సంతోషిస్తారు.

దుగ్గిరాల ఇంట సంబరాలు – కవి, పోలీసుల చర్చ

అప్పూ తన కూతురుతో అత్తింటికి అడుగుపెడుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి అప్పూకి, పాపకు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇందిరాదేవి పాపను చూసి మురిసిపోతూ “ముచ్చటగా మూడో మహాలక్ష్మీ ఇంటికి వచ్చింది” అని సంతోషం వ్యక్తం చేస్తుంది. మరోవైపు పాప భవిష్యత్తు గురించి కల్యాణ్, అప్పూల మధ్య సరదాగా చర్చ జరుగుతుంది. పాపకు కవితా జ్ఞానం ఉండాలని, తనలా కవి కావాలని కల్యాణ్ అంటాడు. కానీ అప్పూ మాత్రం “నీలా కవి కాదు, నాలా ధైర్యవంతురాలైన పోలీస్ కావాలి” అని అంటుంది. ఇద్దరూ కలిసి పాప కవి, పోలీస్ రెండూ అవుతుందని నిర్ణయించుకుంటారు. అటు సుభాష్, అపర్ణ, ఇటు ప్రకాశం, ధాన్యలక్ష్మీ తమ మనవరాళ్లను ఆడిస్తూ మురిసిపోతుంటారు.

మరోవైపు రాజ్ అయితే పాపను తన చేతులతో స్వయంగా ముస్తాబు చేస్తాడు. తన కూతురును తనకు నచ్చినట్లు రెడీ చేస్తానని చెప్పడం చూసి కావ్య ఎంతో ఆనందపడుతుంది. “ఈ ఆనందం అంతా నీ వల్లే కావ్య” అని ఇందిరాదేవి ప్రశంసిస్తుంది.

బారసాలకు మంత్రి ఆహ్వానం – రుద్రాణి కొత్త ప్లాన్!

ఇదే సమయంలో దుగ్గిరాల ఇంటికి మంత్రి ధర్మేంద్ర వస్తాడు. తన కూతురు బారసాల వేడుకకు అందరినీ ఆహ్వానిస్తాడు. ముఖ్యంగా రాజ్, కావ్యలను ఈ ఫంక్షన్‌కు తప్పక రావాలని కోరుతాడు. ఈ బారసాల వేడుకలోనే రుద్రాణి తన పాత పగను తీర్చుకునేందుకు మరో కొత్త ప్లాన్ వేస్తున్నట్లు అర్థమవుతుంది. మరోవైపు, హాస్పిటల్ దగ్గర అటాక్ చేసిన రౌడీలు తమ అదుపులో ఉన్నారని, వాళ్లని ఏం చేయమంటారు అని ఎస్సై ధనుంజయ్ అప్పూకు ఫోన్ చేసి అడగడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

రాబోయే ఎపిసోడ్‌లో రుద్రాణి కుట్రలు ఎలా బయటపడతాయో, మంత్రి గారి ఇంటి బారసాలలో ఎలాంటి కొత్త ట్విస్టులు ఎదురుకానున్నాయో చూడాలి. నిత్యం కొత్త మలుపులు తిరిగే ఈ ‘బ్రహ్మముడి’ BrahmaMudi Serial ప్రతీక్షణం ఆసక్తి రేపుతోంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి