RRR Movie : ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌కి స‌న్నాహాలు.. ఇద్ద‌రు హీరోలు మ‌ళ్లీ మూడేళ్లు కేటాయిస్తారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Movie : ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌కి స‌న్నాహాలు.. ఇద్ద‌రు హీరోలు మ‌ళ్లీ మూడేళ్లు కేటాయిస్తారా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :2 February 2022,10:00 am

RRR Movie : ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆయ‌న ఒక సినిమాని మించి మ‌రోటి అన్నట్టు చిత్రీక‌రిస్తున్నాడు. ఇప్ప‌టికే బాహుబ‌లితో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రాజ‌మౌళి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు.స్వాతంత్ర్య సమరయోధులు నిజ జీవితంలో ఎప్పుడూ కలుసుకోనప్పటికీ, ఒక మిషన్ కోసం వారు ఎలా చేతులు కలిపారు అనే కల్పిత కథ.

కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు స్వాతంత్ర్య పోరాటంలో చేరిన తర్వాత ఆర్ఆర్ఆర్ ముగుస్తుంది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిత్రానికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ ఇప్పటికే “ఆర్.ఆర్.ఆర్” కోసం కథని రాయటం మొదలు పెట్టారట. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనుకున్న స్థాయి లోనే బ్లాక్ బస్టర్ అయితే రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి కూడా రెడీ అని తెలుస్తోంది.

vijayendra prasad plans sequal for rrr Movie

vijayendra prasad plans sequal for rrr Movie

RRR Movie : సీక్వెల్‌కి షేక్ అవ్వాల్సిందే…!

ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. మరి సీక్వెల్ కోసం మరొక రెండు మూడేళ్లు ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరో రెండు మూడేళ్ల పాటు రాజమౌళికి ఇవ్వగలరా అని అభిమానులు సైతం ఆలోచనలో పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కనుకు బాహుబ‌లిని మించి హిట్ అయితే దీనికి సీక్వెల్ చేసే ఆలోచ‌న త‌ప్ప‌క వ‌స్తుంద‌ని కొంద‌రు విశ్లేష‌కులు అంటున్నారు. హీరోలు కూడా ఆస‌క్తి చూప‌డం ఖాయం అని చెబుతున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం అద్భుతాలు జరుగుతాయో..!

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది