Vikram – Major : ‘విక్రమ్’ దెబ్బకు ‘మేజర్’ తట్టుకోలేడా..టాక్ ఏంటీ ఇలా ఉంది..?
Vikram – Major : క్షణం, ఎవరు, గూఢచారి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత టాలెంటెడ్ హీరో అడవి శేషు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మేజర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. భారీ అంచనాల మధ్య మూడు భాషలలో ఈ వారం విడుదల కాబోతుంది. మేజర్ సందీప్ కథ అవ్వడంతో దేశ వ్యాప్తంగా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు తమిళంలో మాత్రం కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాతో పెద్ద పోటీ తప్పక పోవచ్చు అంటూ ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మేజర్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ వెనకాల మహేష్ బాబు ఉండటం అదీకాక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ వారు ఉండటం కూడా అంచనాలు పెరగడానికి ఓ కారణం. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన మేజర్ సినిమా కరోనా వల్ల చాలా ఆలస్య అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మహేష్ బాబు బ్యానర్ లో మొదటిసారి బయటి హీరోతో చేస్తున్న సినిమా ఇదే. అందుకే మహేశ్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా భారీగానే ఓపెనింగ్స్ ఉన్నాయి.అమెరికాలో అడవి శేష్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల డే వన్ అండ్ డే 2లలో మంచి వసూళ్లు నమోదు అవుతాయని నమకంగా ఉన్నారు. ఉత్తరాదిన సందీప్ ఉన్ని కృష్ణన్ కు ఉన్న క్రేజ్ కారణంగా రికార్డ్ స్థాయిలో వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది.
Vikram – Major : అక్కడ వంద కోట్ల టార్గెట్..?
కానీ, తమిళ నాట మాత్రం సినిమాకు కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చు అంటున్నారు. దీని కారణం విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా. ఈ సినిమా అక్కడ వంద కోట్ల టార్గెట్ తో విడుదలవుతోంది. టీజర్ రిలీజైనప్పటి నుంచే అద్బుతమైన సినిమా విక్రమ్ యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మేజర్ తెలుగు, హిందీ, తమిళ, మలాయాళ భాషలలో రిలీజ్ కాబోతోంది. కానీ, ఆ సినిమాను బీట్ చేసి మన మేజర్ దూసుకు పోవాలంటే మాత్రం చాలా కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విక్రమ్ నిరాశ పరిచి మేజర్ అద్బుత విజయం సాధిస్తే అప్పుడు తమిళనాట కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, లెజండరీ నటుడు కమల్ హాసన్‌తో పోటీ పడి అడివి శేష్ హిట్ సాధించాడనే పేరు కూడా చాలాకాలం ఉంటుంది.