Virata Parvam movie Everyone Talks About Sai Pallavi
Sai Pallavi : సౌత్‌లో టాలెంటెడ్ హీరోయిన్ అంటే సాయి పల్లవి గురించి అందరూ చెబుతుంటారు. హీరో ఎవరున్నా సాయి పల్లవి హీరోయిన్ అంటే మాత్రం కాస్త సినిమాకు క్రేజ్ ఆమె వల్ల ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన నేచురల్ పర్ఫార్మెన్స్ కోసం సినిమాకెళ్ళే ప్రేక్షకులే ఎక్కువ ఉంటున్నారు. ఇటీవల వచ్చిన లవ్ స్టోరి దీనికి ఉదాహరణ. ఇక ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా విరాటపర్వం. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా 90ల్లో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అన్నలు అంటే సామాన్య ప్రజల్లో ఒక గౌరవం ఉండేది. వాళ్ళు పోరాడేది మనకోసమే, ప్రాణాలిచ్చేది మన కోసమే అని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. ఆ తర్వాత కాలంలో ఉద్యమం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది.
అయితే ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఆ వేవ్ ని కాష్ చేసుకోవడానికి ఎన్నో సినిమాలు ఉద్యమాన్ని బేస్ చేసుకోని వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. గత కొంతకాలంగా ఈ జానర్ లో సినిమా రాలేదు. అద్ముకే, 2022లో మాత్రం తెలుగులో రెండు సినిమాలు ఇదే జోనర్ లో రెడీ అయ్యాయి. అందులో ఒకటి ఆచార్య కాగా, మరొకటి విరాటపర్వం. ఇప్పటికే వచ్చిన ఆచార్య డిజాస్టర్‌గా మిగిలింది. దీనికి కారణం కథ మొత్తం నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో లేకపోవడమే. ఇక రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా కలిసి నటించిన విరాటపర్వం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటివరకూ బయటకి వచ్చిన అప్డేట్స్ చూస్తే… రానా కన్నా సాయి పల్లవి పైనే విరాటపర్వం ఎక్కువగా ఫోకస్ అయినట్లు తెలుస్తోంది. వేణు ఉడుగుల విరాటపర్వం కథని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఆ వాస్తవ సంఘటనలు.. బెల్లీ లలిత జీవితం ఆధారంగా విరాటపర్వం సినిమా రుపొందినట్లు తెలుస్తోంది.
Virata Parvam movie Everyone Talks About Sai Pallavi
నక్సల్ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో, లలిత ఎన్నో పాటలు పాడి, ఎన్నో ప్రసంగాలు ఇచ్చి ఉద్యమాన్ని… ఉద్యమ గొప్పదనాన్ని ప్రజల్లోకి తీసుకోని వెళ్లింది. ప్రజలను చైతన్య వంతం చేసే ప్రయత్నం చేసింది. ఆమె ఎరుపు రంగు అద్దుకున్న నిప్పు కణిక వంటిది. అందుకే ఆమెని పోలీసులు పట్టుకోని వెళ్లి, ముక్కలు ముక్కలుగా నరికి… వాటిని ఎక్కడెక్కడో చల్లారు. ఇది చరిత్రలో ఒక ఆడడానికి జరిగిన ఘోరమైన సంఘటన. బెల్లి లలితతో పాటు ఆమె టీంని కూడా పోలిసులు ఘోరంగా చంపారు. ఈ బెల్లి లలిత జీవితానికే కొంత కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం తెరకెక్కించాడు. ఇలాంటి పాత్రకు సాయి పల్లవి తప్ప మరెవరూ సూటవరనే విషయం ఎవరైనా ఒప్పుకోవాలి. అందుకే, ఈ సినిమాలో హీరోగా నటించిన రానా కంటే సాయి పల్లవి వల్లే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి – నందితా దాస్ అలాగే, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రియమణి ఇందులో కామ్రేడ్ భరతక్క పాత్రను పోషించింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.