Sai Pallavi : అందరూ మాట్లాడుకుంటుంది సాయి పల్లవి గురించే.. మరి రానా పరిస్థితి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sai Pallavi : అందరూ మాట్లాడుకుంటుంది సాయి పల్లవి గురించే.. మరి రానా పరిస్థితి..?

 Authored By govind | The Telugu News | Updated on :4 June 2022,7:30 pm

Sai Pallavi : సౌత్‌లో టాలెంటెడ్ హీరోయిన్ అంటే సాయి పల్లవి గురించి అందరూ చెబుతుంటారు. హీరో ఎవరున్నా సాయి పల్లవి హీరోయిన్ అంటే మాత్రం కాస్త సినిమాకు క్రేజ్ ఆమె వల్ల ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన నేచురల్ పర్ఫార్మెన్స్ కోసం సినిమాకెళ్ళే ప్రేక్షకులే ఎక్కువ ఉంటున్నారు. ఇటీవల వచ్చిన లవ్ స్టోరి దీనికి ఉదాహరణ. ఇక ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా విరాటపర్వం. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా 90ల్లో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అన్నలు అంటే సామాన్య ప్రజల్లో ఒక గౌరవం ఉండేది. వాళ్ళు పోరాడేది మనకోసమే, ప్రాణాలిచ్చేది మన కోసమే అని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. ఆ తర్వాత కాలంలో ఉద్యమం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది.

అయితే ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఆ వేవ్ ని కాష్ చేసుకోవడానికి ఎన్నో సినిమాలు ఉద్యమాన్ని బేస్ చేసుకోని వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. గత కొంతకాలంగా ఈ జానర్ లో సినిమా రాలేదు. అద్ముకే, 2022లో మాత్రం తెలుగులో రెండు సినిమాలు ఇదే జోనర్ లో రెడీ అయ్యాయి. అందులో ఒకటి ఆచార్య కాగా, మరొకటి విరాటపర్వం. ఇప్పటికే వచ్చిన ఆచార్య డిజాస్టర్‌గా మిగిలింది. దీనికి కారణం కథ మొత్తం నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో లేకపోవడమే. ఇక రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా కలిసి నటించిన విరాటపర్వం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటివరకూ బయటకి వచ్చిన అప్డేట్స్ చూస్తే… రానా కన్నా సాయి పల్లవి పైనే విరాటపర్వం ఎక్కువగా ఫోకస్ అయినట్లు తెలుస్తోంది. వేణు ఉడుగుల విరాటపర్వం కథని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఆ వాస్తవ సంఘటనలు.. బెల్లీ లలిత జీవితం ఆధారంగా విరాటపర్వం సినిమా రుపొందినట్లు తెలుస్తోంది.

Virata Parvam movie Everyone Talks About Sai Pallavi

Virata Parvam movie Everyone Talks About Sai Pallavi

Virataparvam: ఇలాంటి పాత్రకు సాయి పల్లవి తప్ప మరెవరూ సూటవరనే విషయం ఎవరైనా ఒప్పుకోవాలి.

నక్సల్ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో, లలిత ఎన్నో పాటలు పాడి, ఎన్నో ప్రసంగాలు ఇచ్చి ఉద్యమాన్ని… ఉద్యమ గొప్పదనాన్ని ప్రజల్లోకి తీసుకోని వెళ్లింది. ప్రజలను చైతన్య వంతం చేసే ప్రయత్నం చేసింది. ఆమె ఎరుపు రంగు అద్దుకున్న నిప్పు కణిక వంటిది. అందుకే ఆమెని పోలీసులు పట్టుకోని వెళ్లి, ముక్కలు ముక్కలుగా నరికి… వాటిని ఎక్కడెక్కడో చల్లారు. ఇది చరిత్రలో ఒక ఆడడానికి జరిగిన ఘోరమైన సంఘటన. బెల్లి లలితతో పాటు ఆమె టీంని కూడా పోలిసులు ఘోరంగా చంపారు. ఈ బెల్లి లలిత జీవితానికే కొంత కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం తెరకెక్కించాడు. ఇలాంటి పాత్రకు సాయి పల్లవి తప్ప మరెవరూ సూటవరనే విషయం ఎవరైనా ఒప్పుకోవాలి. అందుకే, ఈ సినిమాలో హీరోగా నటించిన రానా కంటే సాయి పల్లవి వల్లే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి – నందితా దాస్ అలాగే, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రియమణి ఇందులో కామ్రేడ్ భరతక్క పాత్రను పోషించింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది