Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని సంఘ‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రేక్ష‌కులు నిశితంగా ప‌రిశీలిస్తూ ఉండ‌డంతో కొన్ని కొన్ని సీక్రెట్స్ కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక బిగ్ బాస్ షోపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా కొన్ని జ‌రిగేవి జ‌రుగుతున్నాయి. హౌజ్‌లో రొమాన్స్ చేయ‌డం, సిగ‌రెట్స్ తాగ‌డంపై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన ముమైత్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని సంఘ‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రేక్ష‌కులు నిశితంగా ప‌రిశీలిస్తూ ఉండ‌డంతో కొన్ని కొన్ని సీక్రెట్స్ కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక బిగ్ బాస్ షోపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా కొన్ని జ‌రిగేవి జ‌రుగుతున్నాయి. హౌజ్‌లో రొమాన్స్ చేయ‌డం, సిగ‌రెట్స్ తాగ‌డంపై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా తదితర సెలబ్రిటీలు స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక ఈ సీజన్ లోనూ పృథ్వీ, నిఖిల్‌ దమ్ముకొడుతూ కనిపించారు.

Bigg Boss 8 Telugu ఎంత ప‌ని చేశావ్..

ముఖ్యంగా నాలుగువారాల పాటు హౌస్ చీఫ్‌గా కొనసాగిన నిఖిల్‌ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా ఆకుల బాగానే ప్రయత్నించింది. అందులో భాగంగానే స్మోకింగ్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది. దీని గురించి స్పందించిన సోనియా ‘ నిఖిల్‌ సిగరెట్‌ తాగడాన్నే చూపించారు. కానీ హౌస్‌లో చాలామంది స్మోక్ చేస్తారు. అమ్మాయిలు కూడా స్మోక్‌ చేస్తున్నారు. కానీ, వాళ్లను మాత్రం చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్‌ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్‌ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. అయిత ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను’ అని పేర్కొంది.

Bigg Boss 8 Telugu సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌ ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్

Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..!

అప్పటి నుంచి కూడా.. ఎవరబ్బా హౌస్‌లో సిగరెట్ తాగుతున్న బోల్డ్ పాప అని అందరూ అనుకున్నారు. చాలామంది అయితే ఇంకెవరూ కిర్రాక్ సీత అని కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ సీజన్ 8లో దమ్ముకొడుతున్న ఆ స్మోకింగ్ పాప ఎవరో కాదు.. విష్ణు ప్రియ.వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి వచ్చిన తరువాత.. మణికంఠని నిఖిల్ ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తున్న క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కార్నర్‌లో సరిగ్గా గమనిస్తే.. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న విష్ణు ప్రియ.. స్మోకింగ్ ఏరియాలో కూర్చుని దమ్ము కొడుతూ కెమెరా కంట పడింది. దమ్ము కొడుతుందో లేదో.. కనిపించి కనిపించనట్టుగా ఉంది కానీ.. ఆమె మాత్రం విష్ణు ప్రియనే అంటున్నారు. మ‌రి ఆమెనో కాదో తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది