Vishnu Priya : నిన్న నైట్ బాగా ఎంజాయ్ చేశా.. అసలు విషయం చెప్పిన యాంకర్ విష్ణుప్రియ
Vishnu Priy : యాంకర్ విష్ణుప్రియ వీకెండ్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వీకెండ్ వస్తే పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతుంటుంది. ఇక వర్కవుట్లు, డ్యాన్స్ ప్రాక్టీస్‌లతోనే విష్ణుప్రియకు టైం సరిపోతుంటుంది. ఇప్పుడు అయితే విష్ణుప్రియ బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు బుల్లితెరపై విష్ణుప్రియకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన పోవే పోరా షోతో గుర్తింపు వచ్చింది. అలా చేసిన మొదటి షోతోనే స్టార్ యాంకర్‌గా మారింది. విష్ణుప్రియ అంతకు ముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేది. అలా మొత్తానికి బుల్లితెరపై పోవే పోరా షోతో ఫుల్ ఫేమస్ అయింది.
ఆ తరువాత శ్రీముఖితో స్నేహం మరింత ఫేమస్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు, రీల్స్, జోకులు, పార్టీలు ఇలా ప్రతీ ఒక్కటి వైరల్ అవుతుంటాయి. ఇక ఈ ఇద్దరూ కలిసి ఏదైనా షోలో కనిపించినా, ఈవెంట్ చేసినా కూడా బాగానే ట్రెండ్ అవుతుండేది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. ఎక్కడా కూడా కలిసి ఈవెంట్లు చేయడంలేదు. కనీసం కలిసి వీకెండ్ పార్టీల్లో కూడా కనిపించడం లేదు. మొత్తానికి విష్ణుప్రియ, శ్రీముఖికి మధ్య గ్యాప్ వచ్చినట్టుంది. అలా విష్ణుప్రియ తన పనులతో తాను బిజీగా ఉంటోంది. వర్కవుట్లు అంటూ ఫుల్ కష్టపడుతోంది.

Vishnu Priya ENjoys At D Cafe on weekend
ఇక డ్యాన్స్ ప్రాక్టీస్‌లో అయితే విష్ణుప్రియ మునిగి తేలుతోంది. అసలే ఇప్పుడు విష్ణుప్రియ ఓ సినిమాలో నటిస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడు అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ వంటి వారు నటించేస్తున్నారు. ఇక తాజాగా విష్ణుప్రియ డీ కేఫ్‌కు వెళ్లిందట. నిన్న రాత్రి ఆ కేఫ్‌లో వండర్ ఫుల్ వాటర్ స్ప్లాష్‌ను ఎంజాయ్ చేశావా? అని తన ఫ్రెండ్ విష్ణుప్రియని అడిగింది. దానికి విష్ణుప్రియ ఇలా సమాధానం ఇచ్చింది. అవును నిజంగానే ఎంజాయ్ చేశాను అంటూ విష్ణుప్రియ సమాధానం ఇచ్చేసింది.