Vishnu priya : విష్ణు ప్రియ కు ఏమైంది .. ?? అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది..??

Authored By aruna | The Telugu News | Updated on : 1 November 2023, 4:00 pm
  •  Vishnu priya : విష్ణు ప్రియ కు ఏమైంది .. ?

  •  అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది..??

  •  పోవే పోరా షో తో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ

Vishnu priya : యాంకర్ విష్ణు ప్రియ భీమినేని అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై పోవే పోరా షో తో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ ఈ షో తో మంచి సక్సెస్ ను అందుకుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ షోను సక్సెస్ఫుల్గా నడిపించింది అయితే ఆమె యాంకరింగ్ గా ఎక్కువ దృష్టి పెట్టలేదు. నటిగా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య సుడిగాలి సుదీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ సినిమాలో ఓ పాత్ర చేసింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కాగా దయ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ కీలక పాత్ర పోషించింది. సీనియర్ హీరో జె.డి.చక్రవర్తి హీరోయిన్ ఈషా రెబ్బా ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాలో లేడీ జర్నలిస్ట్ గా విష్ణు ప్రియ అందరినీ ఆకట్టుకుంది. ఓ పవర్ఫుల్ పాత్రకు విష్ణు ప్రియ బాగా సెట్ అయింది. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఓటీటి అవార్డ్స్ లో దయా డైరెక్టర్ పవన్ సాదినేని, హీరో జెడి చక్రవర్తి అవార్డ్స్ కొల్లగొట్టారు. దీనితో ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.

ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ తో హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. అయితే తాజాగా విష్ణు ప్రియ షేర్ చేసిన ఓ రీల్ చర్చకు దారి తీసింది. ఆ రీల్ లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ సాంగ్ పోస్ట్ చేసిన విష్ణు ప్రియ మానసిక ఆరోగ్యం కరాబ్, శారీరక ఆరోగ్యం కరాబ్, రిలేషన్ షిప్ కరాబ్, షెడ్యూల్స్ కరాబ్, కెరీర్ కరాబ్ అయినా ఇలా చిల్ అవుతున్నా అని పోస్ట్ పెట్టింది. దీంతో విష్ణు ప్రియ ఏదో బాధలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఆరోగ్యంతో పాటు మొత్తం గా కోల్పోయారని సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విష్ణు ప్రియకు ఏమైందో అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

aruna

No bio available for this author.

  1. "Tech Mahindra Employee : టెక్ మహీంద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా.. సిక్ లీవ్ అడిగానని ఉద్యోగం తీసేశారు.. వీడియో వైర‌ల్‌"

  2. "Pawan Kalyan OG 2 Update : పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు OG 2 బిగ్ సర్‌ప్రైజ్?.. ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియో రెడీ అంట!"

  3. "Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 3 రోజుల సెలవులు..!"

  4. "Jana Nayagan Box Office Collection : జన నాయగన్ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది.. అడ్వాన్స్ బుకింగ్ అన్ని కోట్లా..?"

  5. "Chennai Love Story Movie Review : చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  6. "Jana Nayagan Movie Review : దళపతి విజయ్ జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Karthika Deepam 2 Today Episode 2026 July 23 : కార్తీక దీపం 2.. మాలినీ మాస్టర్ ప్లాన్‌కు శివన్నారాయణ షాకింగ్ కౌంటర్.. చివర్లో ఊహించని ట్విస్ట్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి