Mahesh Babu : త్వరలోనే మహేష్ బాబు ఇంట్లో ఫంక్షన్ .. తన కన్నతల్లి కోరికను తీర్చబోతున్న మహేష్ బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : త్వరలోనే మహేష్ బాబు ఇంట్లో ఫంక్షన్ .. తన కన్నతల్లి కోరికను తీర్చబోతున్న మహేష్ బాబు..!

 Authored By aruna | The Telugu News | Updated on :1 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •   మహేష్ బాబు ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది

  •  త్వరలోనే మహేష్ బాబు ఇంట్లో ఫంక్షన్ ..

  •  తన కన్నతల్లి కోరికను తీర్చబోతున్న మహేష్ బాబు..!

Mahesh Babu : త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కుటుంబంలో ఒక శుభకార్యాన్ని జరిపించాలని భావిస్తున్నారని తెలుస్తుంది. మనకు తెలిసిందే మహేష్ బాబు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. షూటింగులు లేనప్పుడు కుటుంబంతో గడుపుతూ ఉంటారు. ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం ఫారిన్ టూర్లు వేస్తూ ఉంటారు. ఇక ఆయన తీసే సినిమాలు కూడా కుటుంబం మొత్తం చూసే విధంగా ఉంటాయి. కుటుంబంతో ఎంతో అనుబంధాన్ని పెన వేసుకున్న మహేష్ బాబు ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులను, అన్నను కోల్పోయిన బాధనుండి బయటపడుతున్నారు.

అయితే ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తల్లి కోరిక తీర్చాలని ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఒక శుభకార్యాన్ని జరుపబోతున్నారు. మహేష్ కూతురు సితార లంగా వోణి ఫంక్షన్ నిర్వహించాలని మహేష్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మనవరాలు సితార లంగా వోణి ఫంక్షన్ చూడాలని ఆ వేడుకను ఘనంగా జరపాలని మహేష్ తల్లి ఇందిరాదేవి బ్రతికున్నప్పుడు కోరుకున్నారట. అయితే ఆమె ఈ వేడుకను చూడకుండానే కనుమూశారు. ఇప్పుడు తన తల్లి కోరికను తీర్చడం కోసం మహేష్ బాబు ఇంట్లో ఫంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఈ ఫంక్షన్ కు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు.

తల్లి కోరిక తీరేలా అంగరంగ వైభవంగా మహేష్ బాబు ఫ్యామిలీ ఈ వేడుకను జరుపనున్నారని టాక్ . ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమాని ప్రకటించి చాలా రోజులవుతున్నప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచర్ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది