Vishnu Priya : ఇంకా అరవై ఏళ్లు ఉండాలి.. ‘అయ్యగారి’పై విష్ణుప్రియ ప్రేమ
Vishnu Priya : అయ్యగారే నెంబర్ వన్ అనే స్లోగన్ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అయ్యగారే నెంబర్ వన్.. అఖిలే నెంబర్ వన్.. అయ్యగారి వల్లే అవుతుందంటూ ఓ తాగుబోతు అభిమాని అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మీమర్స్‌కు మంచి కంటెంట్ దొరికినట్టు అయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటూ.. అయ్యగారైన అఖిల్ కంటే.. ఆ అయ్యగారికే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది.

vishnu priya on akhil akkineni 6 years in tfi
అయ్యగారు అంటూ నన్ను ఫేమస్ చేసేశాడంటూ అఖిల్ కూడా అనేశాడు. మొత్తానికి అఖిల్ అయితే మొదటిసారిగా హిట్ కొట్టేశాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ అఖిల్ పర్వాలేదనిపించాడు. కెరీర్‌లో మొదటి సారి విజయాన్ని చవి చూశాడు. అలాంటి అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతోందట. ఈ సందర్బంగా అయ్యగారి అభిమానులు హల్చల్ చేస్తున్నారు.
Vishnu Priya : అఖిల్‌పై విష్ణుప్రియ..

vishnu priya on akhil akkineni 6 years in tfi
అయ్యగారి అభిమాని అంటే అందులో విష్ణుప్రియ ముందు వరుసలో ఉంటుంది. అసలే అఖిల్ అంటే పిచ్చి ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని ఉందని బహిరంగంగానే చెప్పేసింది. అలాంటి అఖిల్ ఆరేళ్లు కాదు ఇంకా అరవై ఏళ్లు ఇలానే ఉండాలట.. అయ్యగారే నెంబర్ వన్ అంటూ విష్ణుప్రియ పోస్ట్ చేసింది. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం అఖిల్ మీదున్న ప్రేమను ఇలా మరోసారి చెప్పేసింది.