Vishnu Priya : మనలో అది చూశాడే.. ఓంకార్‌పై విష్ణు ప్రియ కొంటె కామెంట్స్
Vishnu Priya : ఓంకార్ అంటే బుల్లితెరపై అందరికీ ఓ రకమైన గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు కొంత మంది ట్రై చేస్తున్న ఎమోషన్స్, టీఆర్పీ జిమ్మిక్కులు ఓంకార్ ఎప్పుడో ట్రై చేసేశాడు. అలా ఓంకార్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు బుల్లితెరపై క్లిక్ అయ్యాయి. చిన్నపిల్లలతో సైతం కన్నీరు పెట్టించి టీఆర్పీలు కొట్టేశాడు. కంటెస్టెంట్లు స్టేజ్ మీద గుండెలు బాధుకునేవారు. అలాంటి ఎమోషన్స్‌ను పిండేస్తూ టీఆర్పీల్లో దూసుకుపోయే వాడు. అలాంటి ఓంకార్ ఈ మధ్య కాస్త వెనుకపడ్డాడు.

Vishnu Priya Satires On Ohmkar In Mayaadweepam Show
అందుకే సిక్స్త్ సెన్స్, డ్యాన్స్ ప్లస్, కామెడీ స్టార్స్ వంటి షోలతో మళ్లీ ఓంకార్ దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఒకప్పుడు ఓంకార్ చేసిన ఆట, మాయాద్వీపం షోలు చిన్న పిల్లలో ఫుల్ క్రేజ్‌ను కొట్టేశాయి. అలా మాయాద్వీపం షో మాత్రం పిల్లలకు ఆల్ టైం ఫేవరేట్‌గా మారింది. చిన్నపిల్లల కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆ షోను మళ్లీ ఇప్పుడు ప్రారంభించాడు. కానీ ఈ సారి పిల్లలతో కాకుండా పెద్దవారిని పట్టుకొచ్చాడు. ఇందులో భాగంగా వచ్చే వారం ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రాబోతోన్నారు.
Vishnu Priya మాయాద్వీపం షోలో శ్రీముఖి, విష్ణుప్రియ

Vishnu Priya Satires On Ohmkar In Mayaadweepam Show
శ్రీముఖి, సోహెల్, మెహబూబ్‌లతో పాటుగా విష్ణుప్రియ కూడా వచ్చింది. ఈ షో చిన్న పిల్లవాళ్ల కోసం కదా? మమ్మల్ని ఎందుకు పిలిచారు? అని శ్రీముఖి అడిగింది. మనలో ఉన్న చిన్న పిల్లలను చూశాడేమోనే అంటూ విష్ణుప్రియ కౌంటర్ వేసింది. దీంతో ఓంకార్ నవ్వేశాడు. సోహెల్, మెహబూబ్‌లతో కలిసి శ్రీముఖి, విష్ణుప్రియలు తెగ రచ్చ చేశారు. ఇక సోహెల్, శ్రీముఖి చేసిన హాట్ డ్యాన్స్ పర్పామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. విష్ణుప్రియ అయితే కళ్లప్పగించి మరీ చూసేసింది.
