Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు మనల్ని ఎంతో సందడి చేస్తాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని అయితే వాటిని చూసి మనం ఫిదా అవ్వాల్సిందే. అయితే ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అబ్బా భలే చేశాడు అని అనుకుంటున్నారు. మరికొందరు ఇలాంటి ఐడియాలు ఎక్కడినుంచి వస్తాయి రా బాబు అని అనుకుంటున్నారు. ఈ వీడియో మాత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.
అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం మొదలై చాలా రోజులు అవుతుంది. ఈ టైంలో రోడ్లన్నీ జలమయం. రోడ్లపై నడిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాలి లేదంటే మ్యాన్ హోల్ లో పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్లు బైకులు నడిపే వాళ్ళు రోడ్లపై నడిచే వాళ్ళ మీద బురద మీద పడేలాగా చూసుకోకుండా వెళతారు. బైకులు నడిపే వాళ్ళు ఏదో రేసింగ్ చేసినట్లు వర్షపు నీరులో స్పీడ్ గా వెళతారు. అటుగా మనం నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఎగజిమ్మే వరద నీరు అంతా మనపై పడుతుంది. మన బట్టలు అన్ని కరాబ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఈ వ్యక్తి చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వ్యక్తి వర్షపు నీరు నిండిన రోడ్డుపై నడుస్తున్నాడు. అయితే ఇక తన వెనకాల ఒక బైక్ హై స్పీడ్ తో వస్తుంది. సరిగ్గా అతడి దగ్గరకు వచ్చేసరికి ఆ బైక్ స్పీడ్ తగ్గించాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి అలా స్లోగా నడపడానికి కారణం ఏంటో తెలుసా. ఈ నడుస్తున్న వ్యక్తి తనపై బురదపడకుండా ఓ పెద్ద రాయిని తన చేతిలో పెట్టుకొని నడుస్తున్నాడు. వర్షపు నీరు తన మీద పడకుండా ఈ వ్యక్తి చాలా తెలివిగా ఆలోచించాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు పలు రకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.