Home » Entertainment » Vishwak Sen Silent On That Matter
Entertainment

Vishwak Sen : ఆ గొడవ గురించి విశ్వక్సేన్ ఎందుకు మాట్లాడటం లేదు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 21, 2023, 11:00 am
Advertisement

Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసాడు సీనియర్ నటుడు అర్జున్. ఇక మనకు తెలిసిందే అర్జున్ నటుడుగా చేస్తూ మరోవైపు సినిమాలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్సేన్ తో ఓ సినిమా చేయాలని అతడిని ఒప్పించి షూటింగ్ మొదలు పెట్టాక విశ్వక్సేన్ వెనక్కి తగ్గాడు. దీంతో అర్జున్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్సేన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకుముందు ఓ కార్యక్రమంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్.

Advertisement

Vishwak Sen silent on that matter

స్క్రిప్ట్ విషయంలో నచ్చక అర్జున్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. అయితే తన కొత్త సినిమా ధమ్కి ప్రమోషన్స్ లో భాగంగా మళ్లీ ఇదే ప్రశ్న విశ్వక్సేనుకు ఎదురయింది. అర్జున్ సినిమా నుంచి తప్పుకున్నందుకుగాను పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చినట్లు వచ్చిన వార్తలపై సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఆ వ్యవహారానికి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు.ఎంతోమందిపై

Advertisement

ఉన్న గౌరవంతో నేను ఆ విషయం గురించి మాట్లాడదలచుకోవడం లేదు అని అన్నారు. అలాగే దమ్కీ సినిమాకి ముందుగా నరేష్ కుప్పిని డైరెక్టర్ అనుకొని తరువాత తప్పించడం గురించి విశ్వక్ స్పందించారు. ముందుగా ఈ సినిమాకు నరేష్ ని డైరెక్టర్గా అనుకున్నా, అతను నేను కలిసి పాగల్ సినిమా చేసాం. దంకీ సినిమాకు అతను న్యాయం చేయగలడని అనుకున్నా, కానీ కథ చర్చలు జరుగుతున్నప్పుడు అతడి స్టైల్ కి, నా కథకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేనే డైరెక్ట్ చేయాలనుకున్నా, తనతో మరో సినిమా చేస్తానని చెప్పా, నాకు అతడికి ఎటువంటి గొడవలు కాలేదు అని చెప్పుకొచ్చారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి