Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ కి అమ్మాయిల మీద అంత మోజు ఉండేదా..??
Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక మహనీయుడు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. అలాగే.. ఆయనకు జాతకాలపై కూడా నమ్మకం ఎక్కువ. వాస్తును నమ్మేవారు. ఆయన అప్పట్లో పాండిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు. ఆయన పాండిత్యం మీద చాలా అవగాహన ఉండేది. వాస్తు అన్నా సంప్రదాయాలు, జ్యోతిష్యానికి చాలా విలువ ఇచ్చారు. ఎన్టీఆర్ నిర్మించిన ఇళ్లు కావచ్చు.. స్టూడియో కావచ్చు ఏవైనా సరే పక్కాగా వాస్తు […]
Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక మహనీయుడు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. అలాగే.. ఆయనకు జాతకాలపై కూడా నమ్మకం ఎక్కువ. వాస్తును నమ్మేవారు. ఆయన అప్పట్లో పాండిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు. ఆయన పాండిత్యం మీద చాలా అవగాహన ఉండేది. వాస్తు అన్నా సంప్రదాయాలు, జ్యోతిష్యానికి చాలా విలువ ఇచ్చారు. ఎన్టీఆర్ నిర్మించిన ఇళ్లు కావచ్చు.. స్టూడియో కావచ్చు ఏవైనా సరే పక్కాగా వాస్తు ప్రకారం ఉండేలా చూసేవారు.
ఆయన ఏదైనా శంకుస్థాపన చేయించాలన్నా.. గృహ ప్రవేశం చేయాలన్నా తిరుపతి వెంకట కవులతో చేయించేవారు. సినీ రంగ ప్రవేశానికి ముందు కూడా ఎన్టీఆర్ జాతకం చూయించుకునే ఇండస్ట్రీలోకి వచ్చారట. అలా.. తన ఫ్యామిలీకి చెందిన అందరి జాతకాలను కూడా అప్పట్లోనే రాయించారట ఎన్టీఆర్. అలాగే.. కొన్ని విషయాల్లో దర్శకుడు విఠలాచార్య సూచనలు కూడా తీసుకునేవారట. ఒకసారి విఠలాచార్య.. అన్న గారికి ఒక విషయం చెప్పారట. ఎన్టీఆర్ కు గజారోహణ యోగం ఉందని చెప్పారట.
Senior NTR : విఠలాచార్య సలహాలు కూడా తీసుకున్న ఎన్టీఆర్
గజారోహణ యోగం అంటే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించడం అన్నమాట. అలాగే.. ఎక్కువ గుర్తింపు లభించడం అన్నమాట. అప్పటికే సినిమాల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. సినిమాల్లోనే రాణిస్తా కావచ్చు అని అనుకున్నారట. కానీ.. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే కదా. అయితే.. విఠలాచార్య.. ఎన్టీఆర్ కు కొన్ని విషయాలు చెప్పలేదట. ముఖ్యంగా ఆడవాళ్లకు దూరంగా ఉండండి అని మాత్రం చెప్పేవారట కానీ.. దాన్ని అంత సీరియస్ గా అన్న గారు తీసుకోలేదట. ఆయన రెండో పెళ్లి చేసుకోవడం వల్లనే ఒక్కసారిగా ఆయన జీవితం మొత్తం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.