Manasa Radhakrishnan : ఆర్జీవి పై ఆసక్తికర కామెంట్లు చేసిన వ్యూహం హీరోయిన్..!
ప్రధానాంశాలు:
Manasa Radhakrishnan : ఆర్జీవి పై ఆసక్తికర కామెంట్లు చేసిన వ్యూహం హీరోయిన్..!
Manasa Radhakrishnan : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా వివాదాలతోనే విడుదలవుతుంది. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘ వ్యూహం ‘. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా వ్యూహం సినిమాను రూపొందించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటించగా, వైయస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ నటించారు. ఇక ఈ సినిమా మార్చి 2న విడుదల అయింది. అయితే తాజాగా వైయస్ భారతి పాత్రలో నటించిన మానస రాధాకృష్ణన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె ఆర్జీవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక వ్యూహం సినిమాలో వైఎస్ భారతి పాత్ర చేయడానికి ఆర్జీవి ఆఫీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు, అది ఫ్రాంక్ కాల్ అనుకున్నానని అది అసలు నమ్మలేకపోయానని మానస రాధాకృష్ణన్ తెలిపారు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఆర్జీవి ఒకరు. అలాంటి ఆయన సినిమాలో అవకాశము రావడం చాలా హ్యాపీగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక వైయస్ భారతి పాత్ర చాలా సింపుల్ గా ఉందని, ఆమె డ్రెస్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుందని అన్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ వివాదాలతో ఆగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి సినిమా విడుదల చేయడం హైకోర్టు కూడా ఆపేయాలని చూసింది కానీ తన పంతం నెగ్గేలా ఆర్జీవి వ్యూహం సినిమాను ఎట్టకేలకు విడుదల చేశారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రజల మధ్యలోకి వచ్చిన వైయస్ జగన్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ఆర్జీవి తెరకెక్కించారు. ఇకపోతే మానస రాధాకృష్ణన్ మలయాళ నటి. పలు మలయాళ సినిమాలలో నటించిన ఆమె తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ తో హైవే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఆర్జీవి వ్యూహం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అచ్చం వైయస్ భారతి లాగే మానస రాధాకృష్ణన్ నటించారు. అందుకు తగ్గట్టుగానే ఆర్జీవి ఆమెకు మేకప్ కూడా వేయించారు. అచ్చం వైయస్ భారతి లాగే సింపుల్గా సినిమాలో కనిపించినట్లుగా తెలుస్తుంది.