Ram Gopal Varma : రంగుల రాజా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం .. అందుకే సినిమా తీస్తున్నా.. RGV | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : రంగుల రాజా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం .. అందుకే సినిమా తీస్తున్నా.. RGV

 Authored By anusha | The Telugu News | Updated on :24 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Ram Gopal Varma : రంగుల రాజా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం .. అందుకే సినిమా తీస్తున్నా.. RGV

Ram Gopal Varma : ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిజ జీవిత ఘట్టాల ఆధారంగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్జీవి సినిమా అంటే వివాదం లేకుండా అయితే రిలీజ్ అయిన దాఖలాలు లేవు. ఇక ఈ సినిమా కూడా వివాదాల మధ్యన విడుదల అవబోతున్నట్లుగానే ఉంది. ఇప్పటికే వ్యూహం సినిమాను ఆపేయాలని నారా లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా వర్మ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చూసుకుంటూ పోతున్నాడు. ఒకపక్క తన లాయర్లు పోరాడుతున్నారని తెలుపుతూ విజయవాడలో ‘ వ్యూహం ‘ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది.

ఇక ఈవెంట్లో ఆర్జీవి మాట్లాడుతూ.. చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు మాత్రమే. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన గొప్ప అని చెప్పడానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమే. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ నిత్యం చేసేది జగన్ ను తిట్టడమే. అలాంటి లోకేష్ మమ్మల్ని తిడుతున్నారని పిటిషన్ వేయడం జోకుగా ఉంది అని వర్మ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక రంగుల రాజా. ఆయనకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలో డైలాగ్స్ చెప్పినట్లు ప్రజలకి అది చేస్తా ఇది చేస్తా అని చెబుతున్నాడు. అన్ని మాటలు చెప్పి చివరికి టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాడు. ఊరు పేరు తెలియని బర్రె లెక్క పోటీ చేసి ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయ్యుండి బర్రె లాగా చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా బర్రెలక్క అని ఆర్జీవి ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఆ ఇష్టం పోయింది. లోకేష్ ఎక్కడా గెలవడు. చంద్రబాబు కొడుకు కాకపోతే పార్టీ కార్యకర్త దగ్గర పని చేయడానికి బాయ్ లాగా కూడా లోకేష్ పనికిరాడు. ఎక్కడ గెలవకుండా పెద్ద మహానుభావుడి లాగా ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాకపోతే లోకేష్ నథింగ్ అని అన్నారు. ఈ సినిమా ద్వారా కొందరు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిత్వం బట్టబయలు చేస్తాను అని ఆర్జీవి అన్నారు. ఈ సినిమా జగన్ కి ఫేవర్ గానే ఉంటుంది. జగన్ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఈ సినిమా తీశాను అని ఆర్జీవి తెలిపారు. ఈ సినిమాతో కొందరు నేతల వ్యక్తిత్వం బట్టలు ఊడదీస్తా అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది