Breaking : అతిపెద్ద వివాదం లో వాల్తేరు వీరయ్య సినిమా…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 11, 2023, 6:20 pm

Breaking : చిరంజీవి, శృతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. బాబీ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించారు. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అన్న‌ట్టు అంచనాలు ఉన్నాయి. ముందుగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్, ఆ తరువాత రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రతి ఒక్కటి అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు.

ఇక‌ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇక తాజాగా విశాఖపట్నంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు.దింతో చాలామంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నారు అని తెగ సంతోషిస్తున్నారు. . ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్‌ ఈనెల 13న గ్రాండ్‌గావిడుద‌ల కానుంది. దీనికి ముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి స్పీచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Waltair Veerayya Movie in the biggest c0ntr0versy

Waltair Veerayya Movie in the biggest c0ntr0versy

Breaking : వివాదంలో వీర‌య్య‌..!!

ముఖ్యంగా రవితేజ గురించి ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 తరువాత మళ్లీ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విమ‌ర్శ‌ల బారిన ప‌డింది. స్టార్ చిరంజీవి పోస్టర్లో చిరంజీవి ఒక పడవ మీద నిలబడి వస్తూ ఉండ‌గా, ఆ పడవ మీద చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయస్వామి ఫోటోతో ఒక జెండా క‌నిపిస్తూ ఉంటుంది. ఇది చూసిన చాలా మంది హనుమంతుడి జెండా పక్కన నిలబడి బీడీ కాల్చడం ఏంటి? ఇది దేవుని అవమానించినట్లు కాదా అని ప్రశ్నిస్తూ ఏకంగా బాయికాట్ వాల్తేరు వీరయ్య అనే హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందా అనేది చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp