Breaking : చిరంజీవి, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ముందుగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్, ఆ తరువాత రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రతి ఒక్కటి అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇక తాజాగా విశాఖపట్నంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు.దింతో చాలామంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నారు అని తెగ సంతోషిస్తున్నారు. . ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్ ఈనెల 13న గ్రాండ్‌గావిడుదల కానుంది. దీనికి ముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ముఖ్యంగా రవితేజ గురించి ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 తరువాత మళ్లీ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విమర్శల బారిన పడింది. స్టార్ చిరంజీవి పోస్టర్లో చిరంజీవి ఒక పడవ మీద నిలబడి వస్తూ ఉండగా, ఆ పడవ మీద చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయస్వామి ఫోటోతో ఒక జెండా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసిన చాలా మంది హనుమంతుడి జెండా పక్కన నిలబడి బీడీ కాల్చడం ఏంటి? ఇది దేవుని అవమానించినట్లు కాదా అని ప్రశ్నిస్తూ ఏకంగా బాయికాట్ వాల్తేరు వీరయ్య అనే హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందా అనేది చూడాలి.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.